MS Dhoni: దేవోరి మాత ఆలయాన్ని తరుచు సందర్శించుకునే ధోనీ.. ఆ గుడి గురించి తెలుసా?

MS Dhoni: టీమిండియా దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీమిండియాకు టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్‌లను తెచ్చిపెట్టిన ఏకైక కెప్టెన్ ధోనీనే. అంతేకాకుండా భారత క్రికెట్‌పై వికెట్ కీపర్‌‌గానూ తనదైన ముద్ర వేశాడు. మైదానంలో ఎప్పుడూ కూల్‌గా కనిపిస్తాడు కాబట్టే అతడిని మిస్టర్ కూల్ అని కూడా పిలుస్తారు. పేరుకు తగిన విధంగానే క్రికెట్‌కు కూడా కూల్‌గానే రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ధోనీ స్వస్థలం జార్ఖండ్‌లోని రాంచీ. అయితే రాంచీలోని దేవోరి ఆలయానికి ధోనీ రెగ్యులర్‌గా వెళ్తుంటాడు. ఈ ఆలయానికి ధోనీ జీవితంలో ఎంతో ప్రత్యేకమైన స్థానముంది. ఈ గుడితో అతడికి విడదీయరాని బంధం, విశ్వాసం ఉంది. రాంచీకి 60 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయంలో దుర్గామాత కొలువై ఉంది. ఇక్కడి అమ్మవారి విగ్రహం నల్లరాతితో సుమారు మూడున్నర అడుగులు ఉంటుంది. సాధారణంగా దుర్గా మాతకు 8 చేతులు ఉంటాయి. కానీ ఈ ఆలయంలో మాత్రం దుర్గా మాతకు 16 చేతులు భక్తులకు కనిపిస్తాయి. ఈ ఆలయం దాదాపు 700 ఏళ్ల చరిత్ర కలిగి ఉంది.

ధోనీతో పాటు ధోనీ కుటుంబసభ్యులు రెగ్యులర్‌గా ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తుంటారు. 2011లో టీమిండియా వన్డే ప్రపంచకప్ గెలిచిన అనంతరం ధోనీ తన మొదటి ప్రార్థన దేవోరి ఆలయంలోని దుర్గా మాతకే నిర్వహించాడు. తనకు ఈ ఆలయంలోని దుర్గా మాతపై ఎంతో నమ్మకం ఉందని.. అందుకే ఏదైనా ముఖ్య పని ఉన్న సమయంలో ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటానని ధోనీ పలు ఇంటర్వ్యూలలో వెల్లడించాడు.

దేవోరి ఆలయం ప్రత్యేకత ఏంటి?

రాంచీ సమీపంలో కొలువై ఉన్న దేవోరి ఆలయంలోని పూజ విధానాలు ఎంతో విభిన్నంగా ఉంటాయి. జార్ఖండ్‌లో గిరిజన సంస్కృతి సంప్రదాయల మాదిరిగా ఇక్కడ పూజా విధానాలు ఉంటాయి. గిరిజనులు కూడా దుర్గామాతను ఆరాధిస్తారు. ఆదివాసీలు వారానికి ఆరు రోజులు పూజిస్తారు. మిగిలిన ఒక్క రోజు మాత్రం బ్రాహ్మణులకు అవకాశమిస్తారు. ఇక్కడి దుర్గామాతను పూజిస్తే శుభం జరగడంతో పాటు జీవితంలో ఎలాంటి అవరోధాలు, ఆర్థిక సమస్యలు కలగవని ప్రజలు విశ్వసిస్తారు.

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts