Mukesh Ambani: నడి సముద్రంలో ముకేష్‌ అంబానీ విల్లా.. ధరవింటే వామ్మో అనాల్సిందే!

Mukesh Ambani: దేశంలో అత్యంత ధనవంతుడు ఎవరి అడిగితే రిలియన్‌ అధినేత ముకేష్‌ అంబానీ అని ఠక్కున సమాధానం చెబుతారు. ఆయన ఆసియాలోనే రెండు ధనవంతుడు. ముకేష్‌ అంబానీకి దేశవిదేశాల్లో ఉన్న ఆయన ఇళ్లలను చూస్తే మతి పోవాల్సిందే. ఇటీవల ముకేష్‌ అంబానీ దుబాయ్‌లో అత్యంత ఖరీదైన, విలాసవంతమైన విల్లాను కొనుగోలు చేశాడు. సముద్రంలో ఉండే పామ్‌ జుమేరా దీవుల్లో దాదాపుగా 80 మిలియన్‌ డాలర్లు అంటే రూ.640 కోట్లు పెట్టి ఈ విల్లాను కొన్నట్లు వార్తాలు వినిపిస్తున్నాయి. ముకేష్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ కోసం ఈ ఖరీదైన విల్లాను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ కొన్న విల్లా, బీచ్‌ సైడ్‌ మాన్షన్‌ కు నార్త్‌ సైడ్‌ లో ఉన్న 10 బెడ్‌రూమ్‌లు కలిగిన ఫ్లాట్‌ లో ఒకటి.

దుబాయ్‌ సమీపంలోని సముద్రంలో నిర్మించిన కృతిమదీవులు ఇవీ. ఈ ప్రాంతమంతా ఈత చెట్లను పోలిన ఈ దీవుల్లో దుబాయ్‌ ప్రభుత్వం విలాసవంతమైన భవనాలను నిర్మించింది. ఏ లోటు లేకుండా అన్ని సదుపాయాలు కల్పించింద. అయిదే వివిధ దేశస్తులు కూడా ఈ ప్రాంతంలో ఆస్తులు కొనుగోలు చేసేందుకు పరిమితులను కూడా సడలించింది. కొనుగోలు చేసిన వారు అక్కడే ఉండేలా గోల్డెన్‌ వీసాలు కూడా జారీ చేస్తోంది అక్కడి ప్రభుత్వం. దీంతో వివిధ దేశాల్లో ఉన్న సంపన్నులు, ప్రబుఖుల సినీ తారలు, వివిధ ఆటగాళ్ల చూపంతా పామ్‌ జమైరా వైపు పడింది. అయితే పామ్‌ జమైరాలో బాలీవుడ్‌ హీరో షారుఖ్‌ ఖాన్, అనంత్‌ అంబానీ, బ్రిటీష్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడు డేవిడ్‌ బెక్‌ హామ్‌ ఇరుగు పొరుగు వారుగా ఉన్నట్లు తెలిసింది.

బ్లూమ్‌ బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం ముఖేష్‌ అంబానీ 93.3 బిలియన్‌ డాలర్ల సంపాదనతో ప్రపంచంలో11వ అత్యంత సంపన్నుడిగా ఉన్నారు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని గ్రీన్‌ ఎనర్జీ, టెక్, ఈ–కామర్స్‌ వైపు వ్యాపిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన బాధ్యతలన్నీ ఆయన వారసులకు అప్పగించనున్నారు. ఇప్పటికే ఆయనకు ఎక్కడెక్కడ ఉన్న వ్యాపారాలను ఇద్దరు కుమారులతో పాటు కూతురుకు కూడా పంచినట్లు వివిధ న్యూస్‌ పేపర్లలో వార్తాలు వస్తున్నాయి. రిలయన్స్‌ జియోకు ఆకాష్‌ చైర్మన్‌ కాగా, ఈ–కామర్స్‌లకు ఈషా అంబానీ హెడ్‌ గా ఉండటమే అందుకు నిదర్శనం. ప్రస్తుతం అనంత్‌ కు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ను అప్పగిస్తారట. పెట్రో కెమికల్స్‌ రంగానికి చెందిన వ్యాపారం కావడంతో అనంత్‌ కోసం దుబాయ్‌ లో ఈ విల్లాను కొనుగోలు చేసినట్లు సమాచారం. తెలుస్తోంది. ప్రస్తుతం ముకేష్‌ అంబానీ కుటుంబ ముంబాయి 27 అంతస్తుల భవనంలో నివాసముంటున్నారు. ఈ భవనంపై హెలిప్యాడ్‌తో పాటు, దాదాపు 60 కూర్చొని చేసే మినీ థియేటర్‌ ఇలా చాలా ఎన్నెన్నో సౌకర్యాలు ఉన్నాయి. మొత్తంగా ఆ భవనాన్ని స్వర్గభవనంలా తీర్చిద్దారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -