Chiranjeevi-Pawan: చిరంజీవి, పవన్ కాంబినేషన్ లో మల్టీస్టారర్.. కానీ?

Chiranjeevi-Pawan: మెగాస్టార్ చిరంజీవి అంటే సినీ ఇండస్ట్రీలో ఒక పవర్. టాలీవుడ్ లో మెగాస్టార్ ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. చిరంజీవి నట వారసులుగా అప్పట్లో పవన్ కళ్యాణ్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఇప్పుడు ఆయన వారసుడు రామ్ చరణ్ తేజ్ ఉన్నారు. అయితే చిరంజీవి కాంపౌండ్ నుంచి ఇప్పుడు చాలా మందే హీరోలు ఉన్నారు. తమ్ముళ్లు, అల్లుళ్లు, కొడుకులు, మేనల్లు వంటివారు సినీ ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్నారు.

 

తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఆర్ఆర్ఆర్ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. పాన్ ఇండియా సినిమాగా రికార్డులు బద్దలు కొట్టింది. ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీ నుంచి మల్టీ స్టారర్ సినిమాల కోసం ఇప్పుడు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

 

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఒకరు మెగా హీరోల కాంబినేషన్ లో సినిమా నిర్మించాలని భావిస్తున్నారని సమాచారం. చిరంజీవి, పవన్, నాగబాబు కాంబినేషన్ లో ఈ సినిమా రానుందని తెలుస్తోంది. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు కలిసి ఆచార్య సినిమాలో సందడి చేశారు. అయితే ఆ సినిమా అంతగా ఆడలేదు.

 

ఇటీవలే చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా విడుదలైంది. మంచి విజయం సాధించింది. ఆ సినిమా తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి మల్టీ స్టారర్ సినిమా వస్తుందని అందరూ అనుకుంటున్నారు. అయితే రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. త్వరలోనే రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, చిరంజీవి కాంబోలో మల్టీ స్టారర్ సినిమా రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఫ్యాన్స్ ఈ కాంబో మూవీ కోసం ఎదురుచూస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -