WPL: ముంబై బౌలర్ల ధాటికి ఢిల్లీ ఖేల్ ఖతం.. సీజన్‌లో తొలి ఓటమి..

WPL: ముంబై వేదికగా జరుగుతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) లో ముంబై ఇండియన్స్ వరుసగా మూడో విజయం సాధించింది. గత శనివారం మొదలైన ఈ సీజన్ లో భాగంగా గుజరాత్, ఆర్సీబీలను ఓడించిన ముంబై.. నిన్న బ్రబోర్న్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ – ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై జట్టు.. మెగ్ లానింగ్ నేతృత్వంలోని ఢిల్లీని చిత్తుగా ఓడించింది.

 

ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. 18 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో మెగ్ లానింగ్ (43) ఒక్కతే రాణించింది. జెమీమా రోడ్రిగ్స్ (25), రాధా యాదవ్ (10) మినహా మిగిలినవారంతా సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. స్టార్ బ్యాటర్లు షఫాలీ వర్మ (2), అలీస్ క్యాప్సీ (6), మరిజన్నె కాప్ (6), జొనాసేన్ (2), వికెట్ కీపర్ తాన్యా భాటియా (4) లు విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో ఇషాక్, వాంగ్, మాథ్యూస్ లు తలా మూడు వికెట్లు పడగొట్టారు.

అనంతరం లక్ష్య ఛేదనలో ముంబై.. 15 ఓవర్లలోనే టార్గెట్ ను అందుకుంది. ఆ జట్టులో ఓపెనర్లు యస్తికా భాటియా (41), హేలి మాథ్యూస్ (32) లు తొలి వికెట్ కు 65 పరుగులు జోడించారు. తర్వాత ఈ ఇద్దరూ పది పరుగుల వ్యవధిలోనే ఔటైనా నటాలీ సీవర్ బ్రంట్ (23 నాటౌట్), హర్మన్‌ప్రీత్ కౌర్ (11 నాటౌట్) లు మరో వికెట్ పడకుండా ముంబైకి హ్యాట్రిక్ విజయాన్ని అందించారు.

 

ఈ సీజన్ లో ముంబైకి ఇది వరుసగా మూడో విజయం. గుజరాత్, ఆర్సీబీ, ఢిల్లీలను ఓడించిన ఆ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక యూపీ, ఆర్సీబీలను ఓడించిన ఢిల్లీ.. మూడో మ్యాచ్ లో బోల్తొ కొట్టింది. ఈ లీగ్ లో నేడు ఆర్సీబీ.. యూపీ వారియర్స్ ను ఢీకొట్టింది. ఆర్సీబీ ఇంతవరకు ఆడిన మూడు మ్యాచ్ లలో ఓడింది. యూపీ రెండు మ్యాచ్ లు ఆడి ఒకదాంట్లో గెలిచి మరోదాంట్లో ఓడింది. నేటి మ్యాచ్ లో గనక ఓడితే ఇక ఆర్సీబీ సీజన్ లో ఫైనల్ చేరే అవకాశాలను కోల్పోయినట్టే.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -