Mumbai Indians: బ్యాలెన్స్డ్ టీమ్ తో ఐపీఎల్ లో అడుగు పెడుతున్న ముంబై ఇండియన్స్!

Mumbai Indians: ఈ సారి ముంబై ఇండియన్స్ తగ్గేదే లే!

ముంబై ఇండియన్స్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ప్రథమ స్థానంలో ఉంటుంది. ఈ జట్టు ఇప్పటికే 5 సార్లు కప్ కొట్టింది. మిగతా ఏ జట్టుకీ ఈ రికార్డ్ లేదు. మ్యాచ్ విన్నర్లు పుష్కలంగా ఉండటం ముంబై కి కొండంత అండ. సమిష్టిగా రాణించడం ముంబై ఇండియన్స్ జట్టుకి ఉన్న అతి పెద్ద బలం. మొదట్లో సచిన్ టెండుల్కర్ ఈ జట్టుని నడిపిస్తే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్రస్తుతం సారథిగా ఉన్నాడు.

రెట్టించిన ఉత్సాహంతో ముంబై!

ఇంత చరిత్ర ఉన్న ముంబై గత సీజన్ లో తడబడింది. గట్టి పోటీ ఇవ్వలేక మధ్యలోనే ఇంటికి వచ్చేసింది. కొంత మంది కీలక ఆటగాళ్లు జట్టులో లేకపోవడం కూడా దీనికి ఒక ప్రధాన కారణం. హార్దిక్ పాండ్య ని ముంబై రిటైన్ చేసుకోలేదు. ఆ నిర్ణయం సరైంది కాదని ముంబై తొందరగానే తెలుసుకుంది.

 

ఐపీఎల్ వేలంలో గుజరాత్ జట్టు హార్దిక్ ని దక్కించుకుని అతడికే జట్టు పగ్గాలు ఇచ్చింది. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా హార్దిక్ పాండ్య ట్రోఫీ ని అందించాడు. ఈ సారి ముంబై కి మరింత కష్టం తీసుకొస్తూ కరేబియన్ స్టార్ పొలార్డ్ ఐపీఎల్ నుంచి ఆటగాడిగా విరమించాడు. పొలార్డ్ ముంబై జట్టుకు మంచి సమతుల్యత తెచ్చేవాడు.

అలవోకగా భారీ సిక్సర్లతో విరుచుకుపడగల ఈ భారీ కాయుడు పొదుపుగా బౌలింగ్ కూడా చేయగలడు. అందుకనే అతడి స్థానాన్ని భర్తీ చేయడానికి ఆస్ట్రేలియన్ ఆటగాడు కామెరూన్ గ్రీన్ ని కళ్ళు చెదిరే ధర పెట్టి కొన్నారు. ఇతడి రాకతో ముంబై ఇండియన్స్ జట్టు మరింత భీకరంగా కనిపిస్తుంది. గట్టి కంబాక్ ఇవ్వడానికి చూస్తున్న జట్టుకు ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. బ్యాటింగ్ విభాగంలో కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, డెవాల్ట్ బ్రెవిస్ ఉన్నారు. బౌలింగ్ లో బూమ్రా, జోఫ్రా ఆర్చర్, బెహ్రండాఫ్, రిచర్డ్ సన్, చావ్లా, కామెరూన్ గ్రీన్ ఉన్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -