Mumbai Indians: తగ్గేదేలే.. ఆ ముగ్గురూ కావాలంటున్న ముంబై టీమ్!

Mumbai Indians: ఇప్పటికే 5 సార్లు టైటిల్ కైవసం చేసుకుని జోరు మీదున్న ముంబై జట్టు.. 2023 టైటిల్ పై ఇప్పుడే కన్నేసింది. ఇక ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం మినీవేలం వేదికను ఉపయోగించుకోవాలని భావిస్తుంది. ఎంపిక చేసిన కొందరు ఆటగాళ్లను ఎంత ఖర్చు చేసి అయినా దక్కించుకోవాలని ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అందులోనూ ఓ ముగ్గురు విదేశీ ఆటగాళ్లపై ముంబై కన్ను పడ్డట్టు వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు..

జేసన్ హోల్డర్:
పోలార్డ్ స్థానాన్ని భర్తీ చేయాలనీ చూస్తున్న ముంబై కి జేసన్ హోల్డర్ మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నదని టాక్. గత సంవత్సరం హోల్డర్ ప్రదర్శన బాగానే ఉన్నా లక్నో అతన్ని వదులుకుంది. ఇక దీనితో అతనికి గాలం వేయాలని ముంబై ప్లాన్ వేసింది. ఇప్పటికే బుమ్రా, ఆర్చర్ లతో బలంగా ఉన్న ముంబై బౌలింగ్.. హోల్డర్ తో చేరితే మరింత బలపడుతుంది.

ఆడమ్ జంపా:
స్పిన్నర్ లేని లోటును భర్తీ చేసుకుందుకు ముంబై కొనాలనుకుంటున్న ప్లేయర్ ఏ ఆడమ్ జంపా. మధ్య ఓవర్లలో ఇతని ప్రదర్శన అద్భుతం. కాబట్టి ముంబై కి కలిసి వస్తుందని భావిస్తున్నారట. ఈ లీగ్‌లో 14 మ్యాచులే ఆడినా, 17.62 సగటుతో 21 వికెట్లు తీసుకున్నాడు. ముంబై ఇతని కోసం ఎంత ఖర్చు చేయడానికైనా సిద్దపడుతోందట.

శామ్ కరన్:
ఇటీవల T 20 వరల్డ్ కప్‌లో “ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్” గా నిలిచిన శామ్ కరన్ కోసం అన్ని టీమ్స్ పోటీ పడుతున్నా.. ప్రత్యేకంగా ముంబై ఎంత ఖర్చు చేసి అయినా దక్కించుకోవాలని స్కెచ్ వేసిందట. కరన్ పర్ఫామెన్స్ కూడా అందరికీ తెలుసు. దీనితో ఇతనికి మంచి గిరాకీ ఉంది. ఇక ముంబై ప్రత్యేక కన్ను పడడంతో కరన్ ని ఎలాగైనా దక్కించుకుంటుందేమో చూడాలి.

ఇక ఈ నెల 23న జరిగనున్న మినీ వేలంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఈ ముగ్గురు విదేశీ ఆటగాళ్లను దక్కించుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది.వీరు ముంబై టీమ్ లో చేరితే ముంబై మరింత బలపడుతుందనే చెప్పాలి. చూద్దాం ఏం జరుగుతుందో..

 

Related Articles

ట్రేండింగ్

Big Shock to Vanga Geetha: వైసీపీ అభ్యర్థి వంగా గీతకు వరుస షాకులు.. సమస్యలు పరిష్కరించకుండా ఓట్లు అడుగుతారా?

Big Shock to Vanga Geetha: మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఏపీ మొత్తం ఒకవైపు అయితే...
- Advertisement -
- Advertisement -