Munugode: ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమవుతాయా? మునుగోడులో ఆ పార్టీదే విజయమా?

Munugode: మునుగోడు ఉపఎన్నిక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉపఎన్నిక ప్రచారం జరుగుతున్న సమయంలోనే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం సంచలనంగా మారడంతో.. మునుగోడు ఉపఎన్నికపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. పార్టీలన్నీ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, హోరాహోరీగా ప్రచారం చేయడంతో ఈ ఉపఎన్నికలో ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠకరంగా మారింది. పార్టీలన్నీ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాయి. నేతలందరినీ మునుగోడులోనే రంగంలోకి దింపి ప్రచారం చేయించాయి.ఇంటింటికి తిరిగి ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేశాయి.

 

ఇక ధనప్రవాహం గురించి ప్రత్యేకగా చెప్పనక్కర్లేదు. పోలింగ్ రోజు కూడా డబ్బులు పంచారంటే మునుగోడులో డబ్బు ప్రవాహం ఏ విధంగా పారిందో తెలుసుకోవచ్చు. తమకు డబ్బులు పంచలేదంటూ కొంతమంది ఓటర్లు ఆందోళనకు దిగారు. పార్టీల నేతలు తమకు డబ్బులు ఇవ్వలేదంటూ పోలింగ్ లో పాల్గొనకుండా బహిష్కరించారు. తులం బంగారం ఓటర్లకు ఇస్తామంటూ పార్టీల నేతలు ఆఫర్ చేశారంటూ మునుగోడులో ప్రలోభాలపర్వం ఏ స్థాయిలో జరిగిందో తెలుసుకోవచ్చు. పార్టీల నేతల మధ్య ఘర్షణలు, దాడులతో మునుగోడు ఉపఎన్నిక వాడివేడిగా జరిగింది.

 

అయితే పోలింగ్ ముగియడంతో మునుగోడు ఉపఎన్నికపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. ఈ ఎగ్జిట్ పోల్ అంచనాలన్నీ టీఆర్ఎస్ కే కట్టం కట్టాయి. రెండు, మూడు సర్వే సంస్థలు తప్ప.. మిగతా సర్వే సంస్థలన్నీ కూడా టీఆర్ఎస్ కే జై కొట్టాయి. ఎస్‌ఏఎస్(ఆత్మసాక్షి), హెచ్ఎంఆర్, పీపుల్స్ పల్స్, పొలిటికల్ లేబొరేటరీ, త్రిశూల్, థర్డ్ విజన్, పల్స్ టుడే, కౌటిల్య, తెలంగాణ జర్నలిస్టు అధ్యయన వేదిక, స్మార్ట్ పొలిటికల్ రిసెర్చ్ సంస్థ మునుగోడు ఉపఎన్నికపై ఎగ్జిట్ పోల్ అంచనాలు అంచనా వేశాయి.

 

ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్ లో టీఆర్ఎస్ కు 41 శాతం నుంచి 42 శాతం, బీజేపీకి 35 శాతం నుంచి 36 శాతం, కాంగ్రెస్ 16.5 శాతం నుంచి 17.5 శాతం, బీఎస్పీ 4 నుంచి 5 శాతం వరకు సంపాదించుకుంటాయని వెల్లడించింది.ఇక హెచ్ఎంఆర్ సంస్థ టీఆర్ఎస్ 42.13 శాతం, బీజేపీ 31.98 శాతం, కాంగ్రెస్ 21.06 శాతం, ఇతరులు 4.83 శాతం వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువరించింది. పీపుల్స్ పల్స్ టీఆర్ఎస్ 44.4 శాతం, బీజేపీ 37.3 శాతం, కాంగ్రెస్ 12.5 శాతం, ఇతరులు 5.8 శాతం వస్తాయని తన ఎగ్జట్ పోల్ అంచనాల్లో తెలిపింది.

 

పొలిటికల్ లేబొరేటరీ సంస్ధ బీజేపీకి 42 శాతం, టీఆర్ఎస్ కి 39 శాతం, కాంగ్రెస్ కి 12 శాతం, బీఎస్పీకి 3 శాతం వస్తాయని అంచనా వేసింది. త్రిశూల్ ఎగ్జిట్ పోల్ అంచనాల్లో టీఆర్ఎస్ 47 శాతం, బీజేపీ 31 శాతం, కాంగ్రెస్ 18 శాతం, ఇతరులు 4 శాతం అని ఇచ్చింది. థర్డ్ విజన్ విషయానికొస్తే.. టీఆర్ఎస్ 48 శాతం నుంచి 51 శాతం, బీజేపీకి 31 శాతం నుంచి 35 శాతం, కాంగ్రెస్ కు 13 శాతం నుంచి 15 శాతం, బీఎస్పీకి 5 శాతం నుంచి 7 శాతం వస్తాయని తెలిపింది. పల్స్ టుడే సర్వేలో టీఆర్ఎస్ కు 42 నుంచి 43 శాతం, బీజేపీకి 38.5 శాతం, కాంగ్రెస్ కు 14 నుంచి 16 శాతం, బీఎస్పీకి 3 శాతం వస్తాయని తెలిపింది. ఇక కౌటిల్య, తెలంగాణ జర్నలిస్టు అధ్యయన వేదిక, స్మార్ట్ పొలిటికల్ రీసెర్చ్ ఎగ్జిట్ పోల్ అంచనాల్లో కూడా టీఆర్ఎస్ గే గెలుపు అవకాశాలు ఉన్నాయిన స్పష్టం చేసింది. ఒక్క పొలిటికల్ ల్యాబరేటరీ సంస్థ తప్పితే.. మిగతా అన్ని సర్వేలలోనూ టీఆర్ఎస్ దే విజయం అని తేల్చేశాయి. మరి ఈ ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమవుతాయా.. లేదా అనేతి 6వ తేదీన చూడాలి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: ఐప్యాక్ స్క్రిప్ట్ ను సీఎం జగన్ ఫాలో అవుతున్నారా.. స్క్రిప్ట్ ప్రకారమే సామాన్యుల్ని కలుస్తున్నారా?

CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ బస్సు యాత్రకు భారీ స్పందన వస్తుంది...
- Advertisement -
- Advertisement -