Munugode Bypoll: వాళ్లది కారు గుర్తు.. సైకిళ్ల మీద రాలేదుగా.. నేనిలా వస్తే తప్పేంటి..? కెఎ పాల్ పంచ్ అదుర్స్

Munugode Bypoll: రాష్ట్రమంతటినీ ఆకర్షించిన మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా నేడు పోలింగ్ జరుగుతున్నది. ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లతో పాటు ప్రపంచ శాంతి దూత అని చెప్పుకునే కెఎ పాల్ కూడా ఈ ఎన్నికల బరిలో అభ్యర్థిగా ఉన్నారు. అయితే నేడు జరుగుతున్న పోలింగ్ సందర్భంగా కెఎల్ పాల్ చేస్తున్న విచిత్ర విన్యాసాలు మునుగోడు ఓటర్లను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఆయన తన పార్టీ (ఉంగరం) గుర్తు మీద వేసిన పంచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

 

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సరళిని పరిశీలించడానికి గాను కెఎ పాల్.. తన చేతి వేళ్లకు ఉంగరాలు ధరించి ఓ పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంగా అక్కడున్నవాళ్లు.. ‘మీ గుర్తు ఉంగరం. చేతికి ఉంగరాలు ధరించి పోలింగ్ బూత్ లోకి రావడం రూల్స్ బ్రేక్ చేసినట్టు కాదా..?’ అని ప్రశ్నించారు. ఎన్నికల నియమావళి ప్రకారం అభ్యర్థులు తాము పోటీ చేసే పార్టీ సింబల్ ను పోలింగ్ బూత్ లో చూపరాదు. అది ప్రలోభాలకు గురి చేసినట్టు అవుతుంది. అయితే తనపై ప్రశ్న వేసిన వారికి పాల్ ఇచ్చిన పంచ్ మాములుగా పేలలేదు.

 

తనను ప్రశ్నించినవారికి పాల్ సమాధానం చెబుతూ.. ‘టీఆర్ఎస్ వాళ్లు బయట కార్లలో తిరుగుతున్నారు. వాళ్లది కారు గుర్తు. వాళ్లు కార్లలో రాకుండా సైకిళ్ల మీద వస్తున్నారా..?’ అని సమాధానం చెప్పారు. అనంతరం మరో పోలింగ్ బూత్ ను పరిశీలించాలని అక్కడ్నుంచి పరుగు లంకించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

 

మునుగోడు ఉపఎన్నికలో భాగంగా గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఓటర్లు ఓటు వేసేందుకు గాను నియోజకవర్గంలో 298 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మునుగోడు బరిలో బీజేపీ నుంచి కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి పోటీ పడుతున్నారు. కెఎ పాల్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచారు.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -