Munugode By-Poll: మునుగోడు ఉపఎన్నిక డేట్ ఫిక్స్? ఆ రోజే ఎన్నిక?

Munugode By-Poll: మునుగోడు ఉపఎన్నిక ఎప్పుడు జరుగుతుంది.. ఏ పార్టీ గెలుస్తుంది అనేది తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. పార్టీలన్నీ ఈ ఉపఎన్నికను చావో రేవో అన్నట్లుగా తీసుకున్నాయి. ఈ ఉపఎన్నికలను ఒక యుద్దంలా భావించి ప్రత్యర్థులను దెబ్బకొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. పార్టీలన్నీ ఇప్పటినుంచే ప్రచారంలోకి దిగాయి. ఇంటింటికి తిగిరి ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అలాగే ఓటర్లకు భారీగా నజరానాలు ప్రకటిస్తున్నాయి. మందుబాబులకు తాగినంత మందు, బిర్యానీలు, డబ్బులు ఇప్పటినుంచే పంచుతున్నారు. విజయదశమి తర్వాత పార్టీలన్నీ మరింత జోరు పెంచనున్నాయి.

అయితే మునుగోడు ఉపఎన్నికకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందనేది రాజకీయ పార్టీలకు అర్ధంక ావడం లేదు. నవంబర్ లో వస్తుందా.. డిసెంబర్ లో వస్తుందా అనే లెక్కలు వేసుకుంటున్నారు. ఎప్పుడొచ్చినా సిద్దంగా ఉండేందుకు పార్టీలన్నీ కసరత్తులు చేస్తున్నాయి. అయితే మునుగోడు ఉపఎన్నికకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మునుగోడు ఉపఎన్నికను నవంబర్ 8న నిర్వహించేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది. నవంబర్ లో హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు జరపాలని ఈసీ భావిస్తుంది. ఆ ఎన్నికలతో పాటే మునుగోడు ఉపఎన్నిక నిర్వహించాలని ఈసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

మునుగోడుతో పాటే హర్యానాలోని ఓ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. షెడ్యూల్ ప్రకారం అయితే హిమాచల్ ప్రదేశ్ లో జనవరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ జనవరిలో శీతాకాలం వల్ల హిమాచల్ ప్రదేశ్ లో మంచు ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ప్రజలు బయటకు రావడానికి ఇష్టపడరు. అంతేకాకుండా ఎన్నికల సిబ్బంది కూడా దూర ప్రాంతాలకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అందుకే నవంబర్ లోనే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు జరపాలని ఈసీ భావిస్తోంది. దీంతో మునుగోడు ఉపఎన్నిక కూడా అప్పుడే జరగనుంది.

ఇక డిసెంబర్ లో గుజరాత్ ఎన్నికలను ఈసీ నిర్వహించే అవకాశముంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ హిమాచల్ ప్రదేశ్ లో పర్యటించారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన ఎన్నికల నిర్వహించే అంశాన్ని పరిశీలించారు. అలాగే మునుగోడు ఉపఎన్నికపై కూడా ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ నివేదిక పంపించారు. సమస్మాత్మక ప్రాంతాలను గుర్తించారు. దీంతో నవంబర్ లో మునుగోడు ఉపఎన్నిక జరగడం ఖాయంగా తెలుస్తోంది. నవంబర్ 8న ఎన్నికల జరిగే అవకాశముంది.

ఇప్పటికే పార్టీలన్నీ ఎన్నికలకు సిద్దమవ్వగా.. దసరా తర్వాత మరింత జోరు పెంచనున్నాయి. ఇప్పిటిక అన్ని పార్టీలు బహిరంగ సభలు నిర్వహించాయి. ఇక దసరా తర్వాత మళ్లీ అన్ని పార్టీలు బహిరంగ సభలు నిర్వహించనున్నాయి. ఇక టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పథకాలను అమలు చేసే పనలో ఉంది. ఎన్నికల నోటిఫకేషన్ వచ్చిన తర్వాత కోడ్ అమల్లో ఉంటుంది. అప్పుడుప్రభుత్వ పథకాలు అమలు చేయడం కుదరదు. అందుకే ప్రభుత్వ పథకాలను అక్కడ వీలైనంత త్వరలో అమలు చేసే పనిలో టీఆర్ఎస్ ఉంది. ఇక బీజేపీ, కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -