Munugode: పోలింగ్‌లో మునుగోడు నియోజకవర్గం సరికొత్త రికార్డు

Munugode:మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ గురువారం ముగిసిన విషయం తెలిసింద. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించగా.. కొన్నిచోట్ల టీఆర్ఎస్, బీజేపీ నేతల ఘర్షణతో పోలింగ్ కొద్దిసేపు ఆగిపోయింది. దీని వల్ల పోలింగ్ ఆలస్యమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమవ్వగా.. సాయంత్రం 6 గంటలకు ముగిసింది. కానీ ఈవీఎంల మొరాయింపు, పార్టీ కార్యకర్తల మధ్య గొడవలతో పలుచోట్ల పోలింగ్ కు ఆటకం కలిగింది. రాత్రి 9 గంటల వరకు కొన్నిచోట్ల పోలింగ్ జరిగింది.

 

ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరడం మనకు కనిపించింది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూకట్టారు. ఉపఎన్నికలో ఓట్లు వేసేందుకు ఓటర్లు ఆసక్తి చూపారు. మునుగోడు ఉపఎన్నిక ప్రతిష్టాత్మంగా మారడంతో.. పార్టీలన్నీ కీలకంగా తీసుకున్నాయి. గెలుపు కోసం వ్యూహలు రచించాయి. పార్టీల మధ్య హోరాహోరీగా ఎన్నిక జరగడం, ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయడం, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టడంతో ఓటర్లు కూడా ఓటు వేసేందుకు ఉత్సాహం చూపారు. ఉదయం పోలింగ్ ప్రారంభం కాక ముందు నుంచే పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని క్యూలో నిల్చున్నారు.

 

ఈ క్రమంలో మునుగోడులో భారీగా పోలింగ్ శాతం నమోదైంది. గత ఎన్నికల్లో నమోదు అయిన పోలింగ్ శాతాన్ని క్రాస్ చేసి రికార్డు బద్దలు కొట్టింది. ఈ ఎన్నికల్లో సరికొత్త రికార్డును నమోదు చేసింది. గత ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గంలో 91.2 శాతం పోలింగ్ నమోదవ్వగా.. ఈ సారి దానిని బద్దలు కొట్టి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ ఉపఎన్నికలో ఏకంగా 93.13 శాతం ఓటింగ్ నమోదైనట్లు శుక్రవారం రాష్ట్ర ముఖ్య ఎన్నిక ప్రధానాధికారి వికాజ్ రాజ్ తెలిపారు. రాజకీయ పార్టీల నుంచి ఏకంగా 98 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు.

 

ఈ నెల 6వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ జరగనున్న క్రమంలో .. పెరిగిన ఓటింగ్ శాతం ఎవరికి కలిసొస్తుంది.. ఎవరికి నష్టం చేకూరుస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. పెరిగిన ఓటింగ్ వల్ల టీఆర్ఎస్ కు నష్టమని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తోన్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను చాటి చెప్పడానికే ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతోన్నాయి. టీఆర్ఎస్ వర్గాలు ప్రచారం ఈ అంచనాలను సమర్ధించడం లేదు. తమ పాలన పట్ల ప్రజల్లో ఉన్న సానుకూలతను చెప్పడానికే ఓటర్లు ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ లో పాల్గొన్నట్లు గులాబీ నేతలు చెబుతున్నారు.

 

నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 241805 ఉండగా.. అందులో 225192 మంది తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇందులో 686 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించలేదు. ఉపఎన్నికల్లో మొత్తం 47 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. వారిలో 15 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. మిగతా వారికి మునుగోడు నియోజకవర్గంలో ఓటు లేకపోవడం వల్ల ఓటు వేయలేదు. పోలింగ్ లో ఉదయం 9 గంటల వరకు 11.2 శాతమే పోలింగ్ నమోదవ్వగా.. 11 గంటల వరకు 25.8 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం నుంచి అనూహ్యంగా పోలింగ్ శాతం పెరుగుతూ వచ్చింది. ఒంటి గంటల వరకు 41.30 శాతం పోలింగ్ జరగ్గా.. 1 గంట నుంచి 5 గంటల వరకు మరో 38 శాతం ఒకేసారి పెరిగింది.సాయంత్రం 6 గంటల్లోపు వచ్చి క్యూలో నిల్చున్న వారందరికీ ఈసీ ఓటు హక్కు కల్పించింది. దీంతో రాత్రి 9 గంటల వరకు పోలింగ్ జరిగింది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -