Disco Shanthi: మా బావకు అదంటే పిచ్చి.. శ్రీహరి భార్య షాకింగ్ కామెంట్స్?

Disco Shanthi: తెలుగు రాష్ట్రాల ప్రజలకు యాక్టర్ శ్రీహరి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగు ఇండస్ట్రీలో రియల్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. తనదైన స్టైల్ లో సినిమాలను ఎంచుకుంటూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా తెలుగు ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా పలు సినిమాల్లో శ్రీహరి విలన్ గా కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు.

అటువంటి గొప్ప నటుడు ఈరోజు మన ముందర లేకుండా తిరుగిరాని లోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పటికీ శ్రీహరి లాంటి నటుడిని కోల్పోయినందుకు సినీ ఇండస్ట్రీ కొంత బాధ వ్యక్తం చేస్తుంది. ఒక సినిమా షూటింగ్లో ఉన్న శ్రీహరికి హఠాత్తుగా గుండెపోటు రావడంతో మరణించారు. ఈ విషయాన్ని అప్పటి టాలీవుడ్ ఇండస్ట్రీ ఏమాత్రం జీర్ణించుకోలేకపోయింది. ఇదంతా పక్కన పెడితే ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీహరి భార్య డిస్కో శాంతి..తన భర్త గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టింది.

శ్రీహరి మంచితనాన్ని సినీ ఇండస్ట్రీలో చాలామంది వాడుకొని తన భర్తని మోసం చేశారని తెలిపింది. తర్వాత తనని పలకరించడానికి కూడా ఎవరూ రాలేదని వెల్లడించింది. అంతేకాకుండా వాళ్లకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టారని తెలిపింది. ఆ టైంలో తనకి డబ్బులు లేక అప్పులు ఎలా తీర్చాలో తెలియక తన నగలు అమ్మి అప్పులు తీర్చిందట. అంతేకాకుండా తన కార్లును కూడా డిస్కో శాంతి అమ్మి తన అప్పుల బాధ తీర్చుకుందట.

అంతేకాకుండా తను నటించిన సినిమాలో పారితోషకం కరెక్ట్ గా ఇచ్చి ఉంటే తనకు ఈ కర్మ పట్టి ఉండేది కాదని డిస్కో శాంతి వెల్లడించింది. కొందరు తనను నటించడానికి వాడుకొని తర్వాత డబ్బులు ఇవ్వలేదని తెలిపింది. అదే విషయం బావకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని, బావకి సినిమాల మీద ఉన్న పిచ్చి ఇష్టంతో నటించడానికి ఒప్పుకునేవాడని, ఆ సమయంలో డబ్బులు ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు అన్నట్లు మాట్లాడేవాడిని డిస్కో శాంతి శ్రీహరి గురించి ఈ విషయాలను వెల్లడించింది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -