Nag-Tabu: నాగార్జున టబు గురించి అమల కామెంట్లు వింటే షాకవ్వాల్సిందే!

Nag-Tabu: టాలీవుడ్ గ్రీకువీరుడు, మగువల మదిని మదించివేసే మన్మథుడు హీరో అక్కినేని నాగార్జున. నాగార్జున చేసిన అన్ని సినిమాలు మంచి టాక్ తెచ్చుకునేవి. అంతే కాదు చాలా వరకు సినిమాలు ఇండస్ట్రీ హిట్ గా నిలిచి, ట్రెండ్ సెట్ చేసాయి. ప్రస్తుతం నాగార్జున నటించిన ఘోస్ట్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో విడుదలవ్వనుంది.

 

 

టబుతో నాగ్ ఎఫైర్..?
అప్పట్లో నాగ్ పై చాలానే గాసిప్స్ ప్రచారం జరిగాయి. వాటిల్లో ఎక్కువగా టబుతో నాగార్జునకు ఎఫైర్ ఉందంటూ జోరుగా వార్తలు వినిపించేవి. వీరిద్దరూ కలిసి పలు సినిమాల్లో నటించారు. అవి రొమాంటిక్ గాను, కమర్షియల్ గాను మంచి విజయం సాధించాయి. దీనితో ఆన్ స్క్రీన్ రొమాన్స్ తో పాటు ఆఫ్ స్క్రీన్ లోను వీరి మధ్య సందంభం ఉందంటూ వార్తలు వచ్చాయి.

ఇటీవల అక్కినేని అమల ఈ వార్తల గురించి స్పందించారు. తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చిన అమల.. నాగ్ టబు ఎఫైర్ గురించి మాట్లాడుతూ “టబు నా భర్తకు, నాకు మంచి ఫ్రెండ్” అని అన్నారు. నాగార్జున టబు మంచి స్నేహితులని, వాళ్లిద్దరి మధ్య ప్రచారం జరిగినట్టుగా ఏం లేదని అమల ఈ సందర్బంగా తెలిపారు. ఈ వార్తలను నాగార్జున, టబు లు కూడా కొట్టిపారేశారని అన్నారు.

ఇక తాము చాలా సంతోషంగా ఉన్నామని, వారింట్లో గాని, కుటుంబంలో గాని ఏదో జరుగుతోందని బాధ పడాల్సిన అవసరం లేదని అన్నారు. కాగా అసలు మా ఇంట్లో సినిమాల గురించి చర్చించుకోము, కేవలం కుటుంబ వ్యవహారాలు మాత్రమే మాట్లాడుకుంటాము అని తెలిపింది. చివరిగా మా ఇల్లు దేవాలయం అంత పవిత్రంగా ఉంటుంది అని అన్నారు అమల.

Related Articles

ట్రేండింగ్

AP Elections: ఏపీ ఎన్నికలలో వారసులు హిట్టా..? ఫట్టా..? ప్రజలు వీరిని ఆదరించడం సాధ్యమేనా?

AP Elections:  ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఈసారి వారసులకు పెద్దపీట వేశారు. ఇప్పటికే అధికార పక్షంలోనూ అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల వారసులకు పలు ప్రాంతాలలో టికెట్లు ఇచ్చారు. ఈ...
- Advertisement -
- Advertisement -