Naga Chaitanya-Krithi Shetty: చైతన్య కృతి వరుస సినిమాల్లో నటించడానికి కారణమిదేనా?

Naga Chaitanya-Krithi Shetty: యంగ్ హీరో నాగ చైతన్య వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ‘లవ్ స్టోరీ, బంగార్రాజు’ సినిమాలతో సాలిడ్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. దీంతో వరుస ఆఫర్లతో ముందుకు దూసుకెళ్తున్నాడు. అయితే ‘థ్యాంక్యూ, లాల్ సింగ్ చడ్డా’ సినిమాలు మాత్రం ఊహించిన స్థాయిలో అలరించలేకపోయాయి. దీంతో సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు నాగ చైతన్య. తన నెక్స్ట్ సినిమాలతో మాస్ హిట్ సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో భారీ యాక్షన్ మూవీని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్షన్‌లో నాగ చైతన్య ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.

 

సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్నారు. తాజాగా షూటింగ్ కూడా స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ రోజే హైదరాబాద్‌లోనే ఫస్ట్ షెడ్యూల్‌ను ప్రారంభించినట్లు చిత్ర బృందం తెలిపింది. అయితే ఈ సినిమా సీక్వెల్‌గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి షెడ్యూల్‌లోనే డైరెక్టర్ వెంకట్ ప్రభు భారీ యాక్షన్ సీక్వెల్‌ను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. అందుకోసం హైదరాబాద్‌లోనే భారీ సెట్ కూడా వేశారట. నాగ చైతన్య పాత్ర ఎంతో మెస్మరైజ్‌గా ఉండబోతుందని, ఇంటెన్స్ యాక్షన్ స్వీకెన్‌ని మహేశ్ మాథ్యూ మాస్టర్ పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఇందులో విలన్‌గా అరవింద్ స్వామి నటించబోతున్నారు. అయితే నాగచైతన్యకు కృతి శెట్టికి మధ్య ఎఫైర్ ఉన్నట్లు ఫిల్మ్ సర్కిల్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అందుకే నాగచైతన్య నటించే సినిమాల్లో కృతి శెట్టికి ఆఫర్లు వస్తాయని ప్రచారం జరుగుతోంది. అయితే వీరిద్దరు మంచి స్నేహితులని, వారి అభిప్రాయాలు కలవడం వల్లే సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయట. అందుకే నాగ చైతన్య కావాలనే కృతి శెట్టికి తన సినిమాల్లో ఆఫర్ ఇస్తున్నట్లు బోగట్టా.

 

తెలుగు- తమిళం బైలింగ్వుల్‌లో ఎన్‌సీ22 చిత్రాన్ని రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్, ఫస్ట్ క్లాస్ టెక్నికల్ స్టాండర్డ్స్ తో సినిమా నిర్మించబోతున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ భారీ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా సినిమా చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించగా.. ప్రియమణి, సంపత్ రాజ్, ప్రేమి విశ్వనాథ్, వెన్నెల కిషోర్, శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -