Naga Chaitanya: నాగచైతన్య రెండో పెళ్లికి రెడీ.. అమ్మాయి ఎవరో తెలుసా?

Naga Chaitanya: అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్య, టాప్‌ హీరోయిన్‌ సమంత కొంత కాలం కిందట విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. విడాకుల తర్వాత ఎవరి లైఫ్‌ వారు బిజీగా గడుపుతున్నారు. అటు సమంత వరుసగా పాన్‌ ఇండియా రేంజ్‌ మూవీస్‌ చేసుకుంటూ బిజీ షెడ్యూల్‌లో ఉంది. మరోవైపు నాగచైతన్య సైతం తన మూవీల్లో తాను నిమగ్నమయ్యాడు. సమంత ఇటీవల మయోసైటిస్‌ అనే అరుదైన జబ్బుతో బాధపడుతున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రకటించిన విషయం తెలిసిందే.

 

సమంత, నాగచైనత్య ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. సుమారు ఏడేళ్ల పాటు ప్రేమాయణం తర్వాత 2017లో గోవాలో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం ఇద్దరూ అన్యోన్యంగా కనిపించారు. అయితే మనస్పర్ధల కారణంగా అనూహ్యంగా విడాకులవైపు పయనమై వేరుపడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా సమంత అరుదైన జబ్బు గురించి సోషల్‌ మీడియాలో ప్రకటించింది.

 

అయితే, సమంత అనారోగ్యంపై అటు నాగ్‌ కానీ, ఇటు నాగచైతన్య గానీ స్పందించకపోవడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో తాజాగా నాగచైనత్య రెండో పెళ్లికి సిద్ధమవుతున్నాడనే వార్తలు హల్‌ చల్‌ చేస్తున్నాయి. తాజాగా నాగచైతన్య రెండో పెళ్లికి సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్‌గా మారాయి.

 

బిజినెస్‌ మ్యాన్‌ కుమార్తెతో పెళ్లి ఫిక్స్‌!
సమంతతో విడిపోయాక నాగచైతన్య ఒంటరయ్యాడనే భావన చాలా మందికి కలిగింది. అయితే, నాగచైతన్యను మళ్లీ పెళ్లి చేసుకోవాలంటూ తండ్రి నాగార్జున సూచించినట్లు తెలుస్తోంది. దీంతో తండ్రి కోరిక మేరకు రెండో వివాహం చేసుకోవడానికి నాగచైతన్య గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చాడని తెలుస్తోంది. దాంతోపాటు ఓ బడా వ్యాపారవేత్త కుమార్తెతో ఏడడుగులు నడవడానికి సిద్ధమైనట్లు కథనాలు వెలువడుతున్నాయి. అయితే, ఇవి పుకార్లేనా, లేక వాస్తవం ఉందా అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

YCP Schemes: వైసీపీ ప‌థ‌కాల‌ను కాపీ కొట్టి పులిహోర క‌లిపేశారు.. చంద్రబాబుకు జగన్ షాక్!

YCP Schemes: ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సందర్భంగా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జగన్ జోరుని పెంచేశారు. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలపై విమర్శలు...
- Advertisement -
- Advertisement -