Naga Chaitanya: సమంత గుర్తుగా నాగచైతన్య రోజూ అలా చేస్తున్నాడట..!

Naga Chaitanya: సినీ పరిశ్రమలో లవ్ చేసుకోవడం, పెళ్లిళ్లు, బ్రేకప్‌లు అనేవి సర్వసాధారణ విషయం అయిపోయింది . ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా కోలివుడ్, బాలీవుడ్ లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. కొన్నేళ్ల క్రితం సుదీర్ఘ కాలం పాటు ప్రేమాయణం సాగించి, పెద్దల సమక్ష్యంలో పెళ్లి చేసుకుని టాలీవుడ్ లో బెస్ట్ కపుల్ గా అందరి ప్రశంసలు అందుకొని ధృడమైన కారణం ఎవరికీ తెలియకుండానే గత అక్టోబర్‌లో అధికారికంగా విడాకులు తీసుకొన్న సమంత , నాగ చైతన్య గురించి ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా సమంత జ్ఞాపకాలతో నాగ చైతన్య ఉన్నాడని, నాగ చైతన్య గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు వినిపిస్తున్నాయి. అవేమిటో తెలుసుకోండిలా..

సుదీర్ఘ ప్రేమ.. ఆ తరువాత పెళ్లి :

టాలీవుడ్ లో హీరో గా ఉన్న సిద్దార్థ తో సమంత మొదట్లో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. మళ్ళి కొన్ని సంవత్సరాల తరువాత సమంత రూత్ ప్రభు, అక్కినేని నాగ చైతన్య కలిసి ‘ఏమాయ చేశావే’ సినిమాలో నటించింది. ఆ సినిమా సమయంలో మంచి ఫ్రెండ్స్ అయిన వీళ్లిద్దరూ.. ‘ఆటోనగర్ సూర్య’ సినిమా చేసిన టైమ్‌లో ప్రేమలో పడ్డారు.

బాగా ఎంజాయ్ చేసిన సినీ జంట

ప్రేమ తరువాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకొన్నారు. పెళ్లి తర్వాత సమంత, నాగ చైతన్య ఎంతో క్రేజీగా గడిపారు. తరచూ పార్టీలు చేసుకోవడం, హాలీడే ట్రిప్‌లకు వెళ్లడం వంటివి చేస్తూ తెగ ఎంజాయ్ చేసే క్రమంలోనే తమకు సంబంధించిన పర్సనల్ విషయాలను సైతం ఫ్యాన్స్‌తో పంచుకుంటూ వచ్చారు. దానికి తోడుగా సినిమాలల్లో కూడా బిజీగా ఎన్నో హిట్ లను కొట్టి బాగా సంపాదించుకొన్నారు.

సమంతపై జ్ఞాపకంగా :

సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకున్న తర్వాత కూడా వీరిపై ఎక్కువ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వివాహం తర్వాత నివాసం ఉన్న ఇంట్లో సమంత కొన్ని మొక్కలను ప్రేమగా పెంచుకునేదట. ఇప్పుడు విడాకులు తీసుకుని వీళ్లు దూరం అయ్యారు. ఈ నేపథ్యంలో ఆ మొక్కలను సంరక్షించే బాధ్యతను నాగ చైతన్య తీసుకున్నాడని తెలిసింది. సమంత పక్కన లేకున్నా ఆమె మొక్కలను చైతూ ప్రేమగా చూసుకుంటున్న విషయం ఇప్పుడు తెగ వైరల్ గా మారింది.

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -