Parasuram: పరశురామ్ మూవీని ఆపేసిన నాగచైతన్య. అలా జరగడంతో?

Parasuram: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతూ ఉన్నటువంటి అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం కస్టడీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ఈ సినిమా మే 12వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో భాగంగా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే గతంలో ఈయన డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి.

ఈ సినిమా ఆగిపోయిందని,అదే కథతో పరుశురామ్ హీరో విజయ్ దేవరకొండతో కలిసి సినిమా చేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి అయితే తాజాగా నాగచైతన్య ఈ విషయం గురించి మాట్లాడుతూ పరశురామ్ గురించి మాట్లాడటం టైం వేస్ట్,ఆయన నా సమయం మొత్తం వృధా చేశారు ప్రస్తుతం తన గురించి మాట్లాడటం కూడా ఇష్టం లేదు అంటూ చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో నాగచైతన్య వ్యాఖ్యలకు పరుశురామ్ సినిమా ఆగిపోయిందని తెలుస్తోంది.

పరశురామ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో రావాల్సిన సినిమాకి శనివారం పూజా కార్యక్రమాలను చేయాలని భావించారట. అయితే ఈ విషయం ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా పూజా కార్యక్రమాలు చేయాలని దిల్ రాజు భావించారు. ఈ విషయం తెలిసిన పలువురు గిల్డ్ సభ్యులు కలుగు చేసుకున్నట్లు తెలుస్తోంది. గిల్డ్ పెద్ద అయి వుండీ, ఓ సినిమా వివాదం తేలకుండా ఇలా చేయడం సరికాదు అని వారించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు డిస్కషన్లు సాగిన తరువాత దిల్ రాజు తన సినిమా పూజా కార్యక్రామన్ని వాయిదా వేసుకున్నట్లు సమాచారం.

 

ఇక ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఆగిపోవడంతో దిల్ రాజు గారు ఈ సినిమా పూజ కార్యక్రమాలను ఆపివేయాలని వారం రోజుల క్రితమే అనుకున్నామంటూ తెలియజేశారు. ఏది ఏమైనా డైరెక్టర్ పరశురాం గురించి వారిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా గురించి చైతన్య చేసిన కామెంట్స్ కారణంగానే ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఆగిపోయాయని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Namrata Shirodkar: రోజురోజుకూ మహేష్ భార్య చిన్నపిల్లవుతోంది.. 50 ఏళ్ల వయస్సులో ఇదేం అందమంటూ?

Namrata Shirodkar:  మనకు వయసు పైబడే కొద్ది మన అందం కూడా తగ్గుతుందని చెప్పాలి. ఇలా వయసు పైబడిన కొద్ది అందం కాపాడటం కోసం సెలబ్రిటీలు పెద్ద ఎత్తున కష్టపడుతూ ఉంటారు కానీ...
- Advertisement -
- Advertisement -