Naga Shaurya: నాగశౌర్య భార్య గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

Naga Shaurya: టాలీవుడ్‌లో మరో యంగ్ హీరో అతి త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. అతడు ఎవరో కాదు.. నాగశౌర్య. తెలుగు తెరపై హీరోగా నాగశౌర్య తన ప్రయాణాన్ని మొదలుపెట్టి దాదాపు 12 ఏళ్లు కావొస్తోంది. ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన అతడు ఇప్పటివరకు 23 సినిమాల్లో నటించాడు. ఇటీవలే నాగశౌర్య 24వ సినిమా ఎనౌన్స్‌మెంట్ వచ్చింది. త్వరలో మరో రెండు సినిమాలు సెట్స్‌పైకి వెళ్లనున్నాయి.

 

నటుడిగా ఎన్నో మెట్లు ఎక్కిన నాగశౌర్య అటు జీవితంలోనూ మరో మెట్టు ఎక్కబోతున్నాడు. అతి త్వరలో అతడు బెంగళూరుకు చెందిన అనూషశెట్టి అనే యువతిని పెళ్లి చేసుకోనున్నాడు. ఎలాంటి రూమర్లు, గాసిప్‌లు లేకుండా అకస్మాత్తుగా పెళ్లి తేదీని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. నాగశౌర్య పెళ్లి విషయాన్ని అతడి పీఆర్వో వంశీ శేఖర్ గురువారం మీడియాకు వెల్లడించాడు.

 

అయితే నాగశౌర్య పెళ్లి చేసుకునే అనూషకు జూనియర్ ఎన్టీఆర్‌కు లింక్ ఉంది. అదేంటంటే.. అనూష శెట్టి ఎన్టీఆర్ కజిన్ సిస్టర్ ఫ్రెండ్. అలా అనూషకు ఎన్టీఆర్‌తో కూడా మంచి రిలేషన్‌షిప్ ఉంది. అనూష ఆర్కిటెక్చర్‌లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. ఆమె ప్రస్తుతం ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేస్తోంది. అనూష శెట్టి డిజైన్స్ అని తానే సొంతంగా ఓ కంపెనీని స్థాపించి వర్క్ చేస్తోంది. హైదరాబాద్, బెంగుళూరులో పలు లగ్జరీ ఇళ్లకు అనూష ఇంటీరియర్ డిజైనింగ్ చేసింది.

 

నాగశౌర్యది ప్రేమ వివాహమా?
నవంబర్ 20న నాగశౌర్య, అనూష వివాహం బెంగళూరులోని జేడబ్ల్యూ మారియట్ హోటల్‌లో అంగరంగ వైభవంగా జరగనుంది. నవంబర్ 20న ఉదయం 11:25గంటలకు వీరి వివాహానికి ముహూర్తంగా పెద్దలు నిర్ణయించారు. అయితే నాగశౌర్యది లవ్ కమ్ ఎరేంజ్డ్ మ్యారేజ్ అని ప్రచారం జరుగుతోంది. ఆర్కిటెక్ట్‌గా కర్ణాటక స్టేట్ విన్నర్ అయిన అనూషతో నాగశౌర్యకు బెంగుళూరులో పరిచయం అయ్యింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. అటు నాగశౌర్య సోదరుడు కూడా కర్ణాటకు చెందిన నమ్రతా గౌడ్‌ అనే అమ్మాయినే వివాహం చేసుకోవడం గమనించాల్సిన విషయం. కాగా నాగశౌర్య ఇటీవల కృష్ణ వ్రింద విహారి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Nomination: చంద్రబాబు నాయుడు నామినేషన్.. చరిత్రలో తొలిసారి ఈ విధంగా జరగబోతుందా?

Chandrababu Nomination: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ విజయం అందుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఏడుసార్లు కుప్పం నుంచి పోటీ చేయగా...
- Advertisement -
- Advertisement -