Nagababu: పవన్ ఫ్యాన్స్ పై నాగబాబు ఫైర్.. అసలేం జరిగిందంటే?

Nagababu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు రెండు రోజుల ముందు నుంచి పెద్ద ఎత్తున చరణ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే చరణ్ అభిమానులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెగా బ్రదర్ నాగబాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన అభిమానులను ఉద్దేశిస్తూ మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో మాట్లాడుతున్న సమయంలో అభిమానులు చేసినటువంటి గోలను చూస్తూ కాస్త అసహనం వ్యక్తం చేసిన నాగబాబు పవన్ కళ్యాణ్ అభిమానులపై మండిపడ్డారు.చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నాగబాబు చరణ్ గురించి మాట్లాడుతున్న సమయంలో బాల్కనీలో ఉన్నటువంటి జనసేన సైనికులు ఏకంగా పవన్ కళ్యాణ్ సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

 

ఈ విధంగా అభిమానులు సీఎం అంటూ నినాదాలు చేయడంతో అసహనం వ్యక్తం చేసిన నాగబాబు జనసేన నాయకులు కార్యకర్తలపై మండిపడ్డారు. మనం ఈ కార్యక్రమం చరణ్ కోసం ఏర్పాటు చేసే ముందు ఆయనకు గౌరవం ఇవ్వాలని తెలిపారు.ఇక పవన్ సీఎం సీఎం అంటూ అరవడం కాదు మీకు దమ్ముంటే ఓట్లు గుద్ధి తనని సీఎంను చేయండి అంటూ జనసేన సైనికులకు చురకలాంటించారు. అలాకాకుండా కేవలం సీఎం అని అరిస్తే సరిపోదని ఈయన సూచించారు.

 

మీకు నిజంగానే దమ్ము ఉంటే ఎలక్షన్లలో పాల్గొని ప్రజలను జనసేన పార్టీకి ఓట్లు వేసే విధంగా వారిని ప్రోత్సహించాలని తెలిపారు. ఇది మనం పవన్ కళ్యాణ్ కు ఇచ్చే బహుమతి అంటూ ఈ వేదికపై నాగబాబు చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.తన తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి నాగబాబు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ పార్టీ కార్యకలాపాలలో ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Viveka Case: వివేకా హత్య కేసులో మరో షాకింగ్ ట్విస్ట్.. ఆ పరీక్ష కీలకమా?

Viveka Case: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా ఆయన హత్య కేసులో నిందితులను కనుగొనడం కోసం సిబిఐ అధికారులు పెద్ద ఎత్తున...
- Advertisement -
- Advertisement -