Nagarjuna: ఇంత కక్కుర్తి అవసరమా నాగ్.. రైతుబంధు డబ్బులెందుకంటూ?

Nagarjuna: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం ‘రైతుబంధు’. రైతులకు ఆర్థికంగా భరోసా కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం ఆ పథకాన్ని అమలు చేస్తోంది. అయితే ఇప్పటికే ఈ పథకాన్నీ విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ పథకంపై ఇప్పటికీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేద రైతులకు కాకుండా సంపన్నులకు ఈ పథకం ఎక్కువగా ఉపయోగపడుతోందని పలువురూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ పథకంపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆకునూరి మురళి కూడా విమర్శించారు. రైతుబంధును టార్గెట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు.

 

 

హైదరాబాద్‌లో జరిగిన ఓ సదస్సులో రైతుబంధు పథకాన్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆకునూరి మురళి మాట్లాడుతూ.. ‘వందల ఎకరాలున్న ధనవంతులకు తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు డబ్బులు ఎందుకు ఇస్తుందో అర్థం కావట్లేదు. టాలీవుడ్‌ ఇండస్ట్రీలోనే ధనికుడైన హీరో అక్కినేని నాగార్జున కూడా రైతుబంధు పథకం ద్వారా లబ్ధిపొందుతున్నారు. వందల కోట్ల డబ్బున్న నాగార్జున లాంటి వ్యక్తులకు రైతుబంధు డబ్బులు అవసరమా?. నిరుపేదలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం.. ధనవంతులకు ఆర్థికంగా సపోర్ట్ చేస్తున్నట్లు అర్థం అవుతోంది. తెలంగాణ వ్యాప్తంగా 600 ఎకరాల భూమి ఉన్న ధనికులకు రైతుబంధు ఇస్తున్నారు. సంపన్న వర్గాలకు రైతుబంధు డబ్బులు ఎందుకు ఇస్తున్నారు? అందులోని ఆంతర్యమేమిటో తెలియడం లేదు.’ అని పేర్కొన్నారు.

 

తెలంగాణ ప్రభుత్వం వానాకాలం, యాసంగి సీజన్‌లలో ఎకరానికి ఐదు వేల చొప్పున మొత్తం రూ.10 వేలు ఇస్తోంది. నిరుపేదలతోపాటు వందల ఎకరాల భూస్వాములకు కూడా ఈ పథకం వర్తిస్తోంది. సంపన్నులకు ఏటా రూ.లక్షలు ఇస్తున్నారు. వ్యవసాయం చేయకుండా ఉంటే సంపన్నులు, ఎమ్మెల్యేలు, మంత్రులకు ఎందుకు డబ్బులు ఇస్తున్నారని ఆకునూరి మురళి ప్రశ్నించారు. తెలంగాణలో మొత్తంగా 60 లక్షల మంది రైతులు ఉన్నారు. ఇందులో 22 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని ఆకునూరి మురళి తెలిపారు. సంపన్న రైతులకు కాకుండా.. కౌలు రైతులు, నిరుపేద రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, 2018లో కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రారంభించింది. ఇప్పటివరకు 9 సీజన్లు పెట్టుబడి సాయం అందించింది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: మేకబోతు గాంభీర్యంతో జగన్ ఎన్నికల పోరు.. సర్వేలను కొంటే సరిపోతుందా?

CM Jagan: త్వరలోనే ఏపీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇక నామినేషన్ ప్రక్రియ కూడా మొదలు కావడంతో ఇప్పటికే పలువురు నేతలు నామినేషన్ కూడా దాఖలు చేశారు....
- Advertisement -
- Advertisement -