Nagarjuna: వామ్మో.. నాగ్ షర్ట్ ఖరీదు తెలిస్తే హార్ట్ ఎటాక్ రావాల్సిందే!

Nagarjuna: అక్కినేని నాగార్జున ప్రస్తుతం బిగ్‌ బాస్‌ షోలో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో ఆద్యంతం ఆసక్తిగా తీర్చి దిద్దేందుకు నిర్వాహకులు అష్టకష్టాలు పడుతున్నారు. ఏ సీజన్‌లో లేని విధంగా ఈసారి కాస్త మసాలా పెంచాలని భావిస్తున్నారు. షోను రక్తి కట్టించడానికి కంటెస్టెంట్లు ఆసక్తిగా పాల్గొనడానికి అనేక రకాల టాస్క్‌లు అందిస్తున్నాడు బిగ్‌ బాస్‌.

 

తెలుగులో ప్రజాదరణ కలిగిన రియాలిటీ షోగా బిగ్‌ బాస్‌ షో నిలుస్తోంది. దీన్ని చూసే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. సెలబ్రిటీలు సైతం ఈ షోను ఫాలో అవుతున్నారు. ఇక సామాన్యుల సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రెమ్యునరేషన్‌ విషయంలోనూ బిగ్‌ బాస్‌ హౌస్‌ మేట్స్‌కు భారీగానే ముడుతోంది. ఈ క్రమంలో సోషల్‌ మీడియా వేదికగా కూడా పలువురు ఈ షో పై ఆసక్తికరంగా స్పందిస్తున్నారు.

ఇక హోస్ట్‌ నాగార్జున సైతం అత్యంత ఉత్సాహంగా షోను నడిపిస్తున్నాడు. నాగ్‌ కోసం కూడా అభిమానులు ఈ షోను చూస్తారనడంలో సందేహం లేదు. ముఖ్యంగా వీకెండ్స్‌లో వచ్చే ఎపిసోడ్స్‌ కోసం చాలా మంది వెయిట్‌ చేస్తుంటారు. శని, ఆది వారాల్లో నాగ్‌ ప్రత్యేకమైన దుస్తులు వేసుకొని షోకు వస్తుంటారు. వీటిపై అనేక మంది ఫ్యాన్స్‌ చర్చించుకుంటున్నారు. వీటి ధరపై కూడా సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తోంది.

 

బిగ్‌ బాస్‌ షోలో నాగార్జున వేసుకునే ఒక్కో డ్రస్ ధర తెలిసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. దీనికి సంబంధించిన ఓ న్యూస్‌ ఇప్పుడు వైరల్‌ అయ్యింది. తాజాగా ప్రసారమైన ఎపిసోడ్‌లో నాగ్‌ వేసుకున్న ఒక్క షర్ట్ ధర సుమారుగా రెండు లక్షలు ఉందని తెలుస్తోంది. షర్ట్‌ విలువే అంత ఉంటే ఇక నాగ్‌ రెమ్యునరేషన్‌ ఇంకెంత ఉంటుందో అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. షో మొత్తానికి నాగ్‌ కాస్ట్యూమ్స్‌కే సుమారు కోటి రూపాయల దాకా ఖర్చయి ఉంటుందని చర్చ నడుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -