Nagarjuna- Jagapathi Babu: హీరో జగపతిబాబు లాగా నాగ్ పరిస్థితి మారనుందా.. అసలు విషయం ఏంటంటే?

Nagarjuna- Jagapathi Babu: తెలుగు రాష్ట్రాల ప్రజలకు నాగార్జున గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రస్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక దసరా కానుకగా నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ప్రవీన్ సత్తార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. దీనికి తగ్గట్టుగానే మొదటిరోజు కలెక్షన్లు దారుణంగా మారాయి.

ఇక రెండో రోజు పరిస్థితి కూడా అలాగే మారింది. కాగా అంచనాలు పెట్టుకున్న సినిమా మేకర్స్ కు నిరాశ తప్పలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. నిజానికి ఒకప్పుడు నాగార్జునకు ఏ సినిమాకైనా మంచి కలెక్షన్లు వచ్చేవి. అంతేకాకుండా సినిమాలు కూడా భారీ స్థాయిలో సక్సెస్ ను అందుకునేవి, అయితే క్రమంగా నాగార్జున సినిమాలు పూర్తిగా పరాజయపాలవుతున్నాయి. సోగ్గాడే చిన్నినాయన, ఊపిరి సినిమా తర్వాత నాగార్జున మంచి వసూళ్లు అందుకున్న సినిమాలు రాలేదని చెప్పవచ్చు.

ఆఫీసర్, మన్మధుడు2, వైల్డ్ డాగ్ వంటి చిత్రాలు పూర్తిగా ఓటమిపాలయ్యాయి. ప్రస్తుతం ది ఘోస్ట్ సినిమా పరిస్థితి చూస్తే అలాగే కనిపిస్తుంది. బంగార్రాజు ఓపెనింగ్స్ బాగా రావడానికి కారణం వారసుడు నాగచైతన్య నటించడం అని వార్తలు బాగా వస్తున్నాయి. అయితే నాగార్జున తోటి హీరో చిరు గాడ్ ఫాదర్ సినిమా కూడా అదే రోజు విడుదలైంది. ఈ సినిమా కొంచెం ఓపెనింగ్స్ బాగానే అందుకుంది. ఇక బాలయ్య నటించిన అఖండ సినిమా కూడా భారీ స్థాయిలో సక్సెస్ అయ్యింది.

అయితే నాగార్జున ఇంతవరకు ఏ సినిమా కూడా ఆ స్థాయిలో విజయాలు తెచ్చిపెట్టలేదు. నాగార్జున ది ఘోస్ట్ సినిమాకు ప్రమోషన్లు బాగా చేపట్టినప్పటికీ కూడా జనాలు థియేటర్ కి కదిలి వెళ్లలేదు. ఈ నేపథ్యంలో నాగార్జున పై యాంటీ ఫ్యాన్స్ అనేక రకాలుగా సెటైర్లు వేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే నాగార్జున జగపతిబాబు మాదిరిగా సహాయ పాత్రలు చేసుకోవాల్సి వస్తుంది కామెంట్లు పెడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -