The Ghost Movie: ఆఫీసర్, వైల్డ్ డాగ్, ది ఘోస్ట్.. నాగ్ ఖాతాలో మరో డిజాస్టర్.. కారణాలివే!

The Ghost Movie: టాలీవుడ్ ఇండస్ట్రీలో మన్మధుడిగా ఎన్నో రొమాంటిక్ సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు కింగ్ నాగార్జున. ఇలా నవ మన్మధుడిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడమే కాకుండా ఎంతో మంది అమ్మాయిలకు అభిమాన హీరోగా మారిపోయారు. ఇకపోతే నాగార్జున ఆరుపదుల వయసులో ఉన్నప్పటికీ వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇకపోతే ఈ మధ్యకాలంలో నాగార్జున కథల ఎంపిక విషయంలో కాస్త తడబడుతున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే ఈయన ఎన్నో ప్రయోగాత్మక సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈయన నటించిన ఆఫీసర్ ది వైల్డ్ డాగ్ వంటి సినిమాలలో ప్రయోగాత్మక పాత్రలలో నటించిన నాగార్జున ఈ సినిమాల నుంచి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. అయితే తాజాగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో వచ్చిన ది ఘోస్ట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా యాక్షన్ సన్నివేశాలతో కూడుకొని ఉండటంతో ప్రేక్షకులకు పెద్దగా ఈ సినిమా ఆకట్టుకోలేకపోయిందని చెప్పాలి.సినిమా అన్న తర్వాత యాక్షన్ తో పాటు కాస్త భావోద్వేగాలు సరదా సన్నివేశాలు ఉండాలి ఇలా ఉన్నప్పుడే ప్రేక్షకులు ఆ సినిమాకు కాస్త ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. అయితే ప్రవీణ్ సత్తార్ ది ఘోస్ట్ సినిమా ద్వారా ఇవేవీ లేకుండా కేవలం యాక్షన్ సన్నివేశాలపై మాత్రమే దృష్టి పెట్టారు.

ఈ విధంగా ఈ సినిమాలో పెద్ద ఎత్తున యాక్షన్స్ సన్ని వేషాలు ఉండడం వల్ల ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది. దీంతో ఈ సినిమా మిశ్రమ స్పందన అందుకుంది.కేవలం యాక్షన్ సన్ని వేషాలు మాత్రమే కాకుండా ఈ సినిమాలో కూడా కాస్త రొమాంటిక్ లేదా ఎమోషనల్ సెంటిమెంట్స్ కనుక ఉండి ఉంటే సినిమా మరో లెవల్ లో ఉండేదని ప్రేక్షకులు వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.ఏది ఏమైనా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి నాగార్జునకు కాస్త చేదు అనుభవమే ఎదురైందని చెప్పాలి.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

Pawan Kalyan: పవన్ కు ఎక్కువ సీట్లు ఇచ్చే ఆలోచన లేదా.. ఏం జరిగిందంటే?

Pawan Kalyan: ఏపీలో తాజాగా జరిగిన పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఏపీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీ హవానే...
- Advertisement -