Megastar Chiranjeevi: చిరంజీవికి చుక్కలు చూపించిన హీరోయిన్ ఎవరో తెలుసా?

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తన సినీ కెరీర్‌లో ఇప్పటివరకు 150కు పైగా సినిమాలు చేశారు. సినీ ఇండస్ట్రీకి ఫుల్‌స్టాప్ పెట్టి.. ప్రజా రాజ్యం పార్టీతో రాజకీయాల్లో అడుగుపెట్టిన పెట్టారు. ఆ తర్వాత మళ్లీ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ‘ఖైదీ నంబర్ 150’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవికి ఊహించని ఫలితం దక్కలేదు. ఆ తర్వాత ‘ఆచార్య, సైరా నర్సింహా రెడ్డి’ సినిమాలు కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఆ తర్వాత విడుదలై ‘గాడ్ ఫాదర్’ సినిమా మాత్రం మంచి కమర్షియల్ హిట్‌ను అందుకుంది.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘వాల్తేర్ వీరయ్య’. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కు మాత్రం ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘భోళా శంకర్’ సినిమాలో నటించనున్నారు. అయితే తెరపై హీరో హీరోయిన్లు ఎలా నటించినా అభిమానులకు పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. అయితే తెరపై సంతోషంగా కనిపించే హీరో హీరోయిన్లు రియల్ లైఫ్‌లో గొడవలు పడిన సంఘటనలు ఉన్నాయి. తన నటించే హీరోయిన్లను గౌరవించడం చిరంజీవి నైజాం. 40 ఏళ్ల సినీ కెరీర్‌లో చిరంజీవి ఏకంగా మూడు తరాల కథానాయికలతో నటించారు. కొంతమంది హీరోయిన్లయితే చిరంజీవితో పదికిపైగా సినిమాలు చేశారు.

వివాదాలకు దూరంగా ఉండే చిరంజీవికే ఓ హీరోయిన్ చుక్కలు చూపించేదని ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. కెరీర్ ప్రారంభంలో చిరంజీవితో కలిసి నటించిన హీరోయిన్ నగ్మా చిరంజీవిని ఎంతో ఇబ్బంది పెట్టినట్లు సమాచారం. చిరంజీవితో కలిసి నగ్మా మూడు సినిమాల్లో నటించారు. రిక్షావోడు (హీరోయిన్లు.. నగ్మా, సౌందర్య), ముగ్గురు మొనగాళ్లు (హీరోయిన్లు.. రోజా, నగ్మా, రమ్య), ఘరానా మొగుడు (హీరోయిన్లు.. నగ్మా, వాణి విశ్వనాథ్), నటించారు. అయితే ఈ మూడు సినిమాల్లో ఘరానా మొగుడు సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అయితే షూటింగ్ సమయంలో హీరోయిన్ నగ్మా చిరంజీవి ఎంతో ఇబ్బంది పెట్టేవారట. షూటింగ్‌కి లేట్‌గా రావడంతో పలు సందర్భాల్లో డూప్‌తో షూటింగ్‌ పూర్తి చేసినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

YS Sunitha: నిందితుడిని పక్కనే పెట్టుకుని అలాంటి కామెంట్లా.. జగన్‌కు సునీత దిమ్మదిరిగే కౌంటర్?

YS Sunitha: గత ఎన్నికల్లో వివేకాహత్యనే ప్రచార హస్త్రంగా వాడుకొని అధికారంలోకి వచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత వివేకాహత్య కేసు గురించి చాలా అరుదుగా మాట్లాడారు. ఓ సారి అసెంబ్లీలో దీనిపై...
- Advertisement -
- Advertisement -