Namrata Shirodkar: మనకు వయసు పైబడే కొద్ది మన అందం కూడా తగ్గుతుందని చెప్పాలి. ఇలా వయసు పైబడిన కొద్ది అందం కాపాడటం కోసం సెలబ్రిటీలు పెద్ద ఎత్తున కష్టపడుతూ ఉంటారు కానీ కొంతమంది మాత్రం వయసు భయపడుతున్న కొద్ది చిన్న పిల్లగా మారిపోతూ ఉంటారు. ఇలాంటి వారిలో నటి నమ్రత ఒకరు. మహేష్ బాబు భార్యగా అందరికీ ఎంతో సుపరిచితమైనటువంటి నమ్రత బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అనే విషయం అందరికీ తెలిసిందే.
ఇక ఈమె మహేష్ బాబుని ప్రేమించి పెళ్లి చేసుకున్న తరువాత సినిమాలకు దూరంగా ఉంటూ ఒక సాధారణ గృహిణిగా ఇంటి బాధ్యతలను నెరవేరుస్తూ పిల్లల బాధ్యతలను చక్కబెడుతూ తల్లిగా ఇంటికి పరిమితమయ్యారు. అయితే ప్రస్తుతం పిల్లలు కాస్త పెద్దఅవ్వడంతో ఈమె మహేష్ బాబుకు మేనేజర్ గా ఉంటూ ఆయన కాల్ షీట్స్ చూసుకోవడం అలాగే పలు వ్యాపార రంగాలలో కొనసాగడం జరుగుతుంది.
ఇలా అన్ని బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నటువంటి ఈమె తాజాగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే ఈ ఫోటోలలో నమ్రత చాలా స్టైలిష్ లుక్ లో కనిపించారు. దీంతో ఈ ఫోటోలు చూసిన వారందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అందరికీ వయసు పెరిగితే ఆనందం తగ్గుతుంది కానీ మహేష్ బాబు నమ్రతల విషయంలో మాత్రం ఇది పూర్తిగా విభిన్నమంటూ కామెంట్లు చేస్తున్నారు.
మహేష్ బాబు కన్నా నమ్రత దాదాపు మూడు సంవత్సరాలు వయసులో పెద్దది ప్రస్తుతం ఏమి అయిదు పదుల వయసులోకి అడుగుపెట్టారు అయినప్పటికీ యంగ్ హీరోయిన్ గా ఉండటానికి కారణం ఏంటి అని ఆరా తీస్తున్నారు అయితే ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఆహార విషయంలో జాగ్రత్తలు పాటించడం తన మనసును ప్రశాంతంగా ఉంచుకోవడమే తన బ్యూటీ సీక్రెట్ అని ఇలా చేయడం వల్ల నమ్రత మరింత అందంగా కనపడుతున్నారు అని చెప్పాలి. తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలను చూస్తే యంగ్ హీరోయిన్స్ కూడా కుళ్లుకునేలా అంత అందంగా ఉన్నారని చెప్పాలి.