Namrata Shirodkar: వైరల్ అవుతున్న నమ్రత శిరోద్కర్ సంచలన వ్యాఖ్యలు!

Namrata Shirodkar: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహేష్ బాబు పక్కన నటించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఇలా మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశం కోసం ఎంతోమంది హీరోయిన్లు ఎదురుచూస్తూ ఉన్నప్పటికీ మహేష్ పక్కన అవకాశం వచ్చిన నటించనని తేల్చి చెప్పేశారు నటి నమ్రత.

నమ్రత బాలీవుడ్ హీరోయిన్ గా ఒకప్పుడు అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.తెలుగులో ఈమె మహేష్ బాబు తో కలిసి వంశీ సినిమాలో నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడి ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడం జరిగింది. నమ్రత స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నప్పటికీ పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమై కేవలం తన పిల్లల బాధ్యతలను కుటుంబ బాధ్యతలను చక్కబెడుతూ ఒక గృహిణిగా ఉండిపోయారు.

ఇలా మహేష్ సినిమాలకు సంబంధించిన విషయాల గురించి కూడా ఈమె చూసుకోవడమే కాకుండా పలు వ్యాపారాలను కూడా ప్రారంభించి వ్యాపార రంగంలో దూసుకుపోతున్నారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నమ్రతకు యాంకర్ నుంచి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది.మీకు మహేష్ బాబు సినిమాలో నటించే అవకాశం వస్తే నటిస్తారా అని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు ఈమె చెప్పినటువంటి సమాధానం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

మహేష్ బాబు సరసన ఎంతటి కీలకమైన పాత్రలో నటించే అవకాశం వచ్చిన తాను సినిమాలలో నటించననీ తేల్చి చెప్పారు.తన ప్రాధాన్యత ప్రస్తుతం పిల్లలు కుటుంబం ఆ తర్వాత తాను చూసుకుంటున్నటువంటి వ్యాపారాలు మాత్రమేనని ఇంతకుమించి తాను సినిమాలలో నటించే అవకాశం లేదు అంటూ ఈ సందర్భంగా నమ్రత చెప్పినటువంటి సమాధానం అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -