Balakrishna: పోలీస్ జీపు పంపిస్తేనే సినిమా షూటింగ్ కి వస్తానన్న బాలయ్య.. అసలు ఎందుకో తెలుసా?

Balakrishna: టాలీవుడ్ ప్రేక్షకులకు నందమూరి బాలకృష్ణ గురించి అతడే నటన గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం కుర్ర హీరోలతో సమానంగా వరుస ఆఫర్లు అందుకుంటూ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా హడావిడి చేస్తున్నాడు బాలయ్య. ఇక బాలయ్య బాబు అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే అప్పట్లో నందమూరి నందమూరి బాలకృష్ణ బి.గోపాల్ కాంబినేషన్ లో వచ్చిన రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా మన అందరికి తెలిసిందే.

ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకొని బంపర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమా అప్పటి మాస్ ఆడియన్స్ ని ఒక రేంజ్ లో ఊపేసింది. 1992 మే 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డులను మరో స్థాయిలో బద్దలు కొట్టింది. కాగా ఈ సినిమా ఈ శనివారంతో 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో రౌడీ ఇన్స్పెక్టర్ షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికరమైన విషయం తెలుసుకుందాం.

పోలీస్ కథ నేపథ్యంలో రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పోలీస్ డ్రెస్ లో బాలయ్య బాబు పర్ఫామెన్స్ కు ప్రేక్షకులు అదిరిపోయారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో బాలయ్య పోలీసులు ఎలా నడుస్తారు.. లాటి ను ఎలా పట్టుకుంటారు అని తెలుసుకొని ఇంటిలోని బాగా ప్రాక్టీస్ చేసేవాడట. ఇక పోలీస్ జీప్ లో ఎలా కూర్చుంటారు అనే దానిపై కూడా బాగా ఆలోచన చేశారట.

ఆ విధంగా ఆ సమయంలో బాలయ్య పోలీస్ పాత్రలో లీనమయ్యాడు. అలా సినిమాలో వాడిన పోలీస్ జీప్ లోనే బాలయ్య సినిమా షూటింగ్ కి వచ్చేవాడట. ఈ విషయాన్ని సినిమా దర్శకుడు బి.గోపాల్ ఒక సందర్భంలో వెల్లడించారు. ఒకరోజు ఉదయం బాలయ్య ఫోన్ చేసి ఈరోజు నేను షూటింగ్ కి రావడం లేదని తెలిపాడట. ఏమైంది బాబు అని అడగగా.. సినిమాలో వాడుతున్న జీపు పంపిస్తే నేను షూటింగ్ కి వస్తా అని అన్నాడట.

ఎందుకంటే అప్పుడే ఆ పాత్రలో లీనమవ్వగలను అని బాలయ్య చెప్పాడట. ఇక బాలయ్య మాట ప్రకారం జీపును పంపించారు. ఆ విధంగా ఎప్పుడు ఏసీ కార్లో వచ్చే బాలయ్య ఆ షూటింగ్ నేపథ్యంలో పోలీస్ జీబులో వచ్చేవాడట. అలా బాలయ్య బాబు పోలీస్ జీబులో షూటింగ్ కి వచ్చి.. అచ్చం పోలీస్ లా లాటి తిప్పేవాడని బి.గోపాల్ తెలియజేశారు.

Related Articles

ట్రేండింగ్

Amala Akkineni-Jr NTR: ఎన్టీఆర్ విషయంలో అమల అంత పెద్ద తప్పు చేసిందా.. అభిమానులు ఎప్పటికీ క్షమించలేరా?

Amala Akkineni-Jr NTR: టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్...
- Advertisement -
- Advertisement -