Nandamuri Balakrishna: ఇతర హీరోలకు షాకిస్తున్న బాలయ్య.. గ్రేట్ అంటూ?

Nandamuri Balakrishna:  నందమూరి నటవారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలయ్య.. తన నటనతో అభిమానుల్లో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. మాస్ జనాల్లో విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించిన బాలకృష్ణ.. ముందు నుండి ప్రయోగాలకు కేరాఫ్ గా నిలిచాడు. ఇప్పుడు ఇదే బాలయ్యను మిగిలిన హీరోలకు భిన్నంగా నిలిపింది.

బోయపాటి శీను డైరెక్షన్ లో చేసిన ‘అఖండ’ సినిమాను ఎంతో ధైర్యంగా థియేటర్లలో విడుదల చేసి హిట్ కొట్టాడు. కరోనా దెబ్బతో లాక్ డౌన్ పడగా.. లాక్ డౌన్ తర్వాత థియేటర్లకు జనాలు రావడానికి భయపడుతున్న సమయంలో బాలయ్య ధైర్యంగా తన ‘అఖండ’ సినిమాను విడుదల చేశాడు. అన్ని వర్గాల ప్రేక్షకులను ‘అఖండ’ థియేటర్లకు తిరిగి వచ్చేలా చేసింది. బాలయ్య సాహసంతో చేసిన ఈ ప్రయోగం విజయవంతం అయింది.

ఓటీటీ ప్లాట్ ఫాం అయిన ఆహాలో టాక్ షో నిర్వహించి.. బాలయ్య అందరినీ ఆశ్చర్యపరిచాడు. బాలయ్య విషయంలో ఉన్న భ్రమలను పటాపంచలు చేస్తూ.. ‘అన్ స్టాపబుల్’ అంటూ అందరి ఊహలకు అందని విధంగా టాక్ షో నిర్వహించాడు. ఈ టాక్ షో భారీ హిట్ అవడంతో.. ఓటీటీలో ఇలాంటి ప్రయోగం చేసిన హీరోగా బాలయ్య నిలిచాడు.

ఇదే పరంపరను కొనసాగిస్తూ బాలయ్య.. మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. తాజాగా అడ్వర్టైజింగ్ ప్రపంచంలోకి ప్రవేశించిన బాలయ్య.. ఓ యాడ్ కోసం సైన్ చేశాడు. మామూలుగా అయితే వేరే హీరోలు పలానా డైరెక్టర్ అయితేనే తాను యాడ్ చేస్తానని చెబుతారు. కానీ బాలయ్య మాత్రం అలా చేయలేదు. యాడ్ చేయిస్తున్న కంపెనీకే సదరు డైరెక్టర్ విషయాన్ని వదిలేశాడు. ఇలా బాలయ్య ప్రయోగాలు చేస్తూ విజయాలు సాధిస్తున్నాడు. మరీ ముఖ్యంగా గత సంవత్సర కాలంగా బాలయ్య టైం నడుస్తోందంటూ తెలుగు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతానన్నవ్.. ఇప్పుడు తలెక్కడ పెట్టుకుంటావ్ జగన్?

YS Jagan:  ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ మీటింగ్ పెట్టిన చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టోని చూపిస్తూ ఒక్క హామీ అయినా నెరవేర్చారా అంటూ కామెంట్ చేస్తున్నారు కానీ ఆయన...
- Advertisement -
- Advertisement -