Nandini Reddy: సమంత బన్నీ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన నందిని రెడ్డి!

Nandini Reddy: తెలుగు సినిమా ఇండస్ట్రీలో లేడీ డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నందిని రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అన్ని మంచి శకునములే సినిమా మే 18 వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నందిని రెడ్డి ఈ సినిమా గురించి కొన్ని విషయాలు తెలియజేశారు.


అన్ని మంచి శకునములే సినిమాకి ముందుగా విజయ్ దేవరకొండను అనుకున్నాము అయితే కరోనా లాక్ డౌన్ పడిన తర్వాత ఈ ప్రాజెక్టు మొదలు పెట్టాలనుకున్నాం అయితే అప్పటికే హీరో విజయ్ దేవరకొండ ఇమేజ్ మారిపోయింది. ఇలాంటి సాఫ్ట్ కథకు ఆయన సూట్ అవ్వరని అర్థమైంది. అందుకే నెక్స్ట్ ఆప్షన్ గా సంతోష్ ను ఎంపిక చేసుకున్నామని నందిని రెడ్డి తెలియజేశారు. ఇక ఈమెకు ఇండస్ట్రీలో సెలబ్రిటీలతో ఎంతో మంచి స్నేహబంధం ఉందని చెప్పాలి.

 

ఈ సందర్భంగా నందిని రెడ్డి మాట్లాడుతూ.. అల్లు అర్జున్ తో ఎంతో మంచి స్నేహబంధం ఉందని తాను చేసే ప్రతి సినిమా కథను అల్లు అర్జున్ కి చెబుతూ ఉంటానని నందిని రెడ్డి తెలిపారు. అల్లు అర్జున్ తో సినిమా చేయాలని ఎప్పటినుంచో భావిస్తున్నాను అయితే ఇప్పుడు ఆయన పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు. ఆయన ఇమేజ్ కి తగ్గట్టు కథ ఉన్నప్పుడే తనతో చేయాల్సి ఉంటుందని నందిని రెడ్డి తెలిపారు.

 

ఇక ఈమెకు నటి సమంతతో కూడా ఎంతో మంచి అనుబంధం ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సమంత గురించి నందిని రెడ్డి మాట్లాడుతూ హార్డ్ వర్క్ విషయంలో అల్లు అర్జున్ సమంత ఇద్దరూ ఒకటేనని, కష్టపడటం వల్లే వాళ్ళిద్దరూ ఈ స్థాయిలో ఉన్నారని ఈ సందర్భంగా నందిని రెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Volunteers Joined In TDP: నెల్లూరు టీడీపీలో చేరిన 100 మంది వాలంటీర్లు.. జగన్ కు ఇంతకు మించిన షాక్ ఉండదుగా!

Volunteers Joined In TDP: ఏపీలో వైయస్సార్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పాలన అన్నట్టు...
- Advertisement -
- Advertisement -