Judges Trolling Case: చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ స్కామ్ లో భాగంగా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అరెస్టు అయిన విషయం మనకు తెలిసిందే. నంద్యాలలో సిఐడి అధికారులు చంద్రబాబు నాయుడుని అదుపులోకి తీసుకున్నారు అనంతరం కోర్టులో హాజరు పరిచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంతో తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు ఒక్కసారిగా రోడ్లపైకి వస్తూ నిరసనలు తెలియజేశారు.
ఇక చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో సోషల్ మీడియాలో ఎల్లో బ్యాచ్ చెలరేగిపోయి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పై మాత్రమే కాకుండా న్యాయవాదులు జడ్జిలపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు చేస్తున్నారు. ఇక చంద్రబాబును రిమాండ్ కు తరలించాలి అంటూ తీర్పు ఇచ్చినటువంటి జడ్జ్ హిమబిందుపై కూడా తెలుగుదేశం పార్టీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది.
ఈ క్రమంలోనే జడ్జిపై అలాగే న్యాయవాదులపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారందరిని వెంటనే అరెస్టు చేయాలి అంటూ ఉత్తర్వులు రావడంతో ఇలాంటి పోస్టులు పెడుతున్నది ఎవరు ఈ సోషల్ మీడియాలో కార్యకర్తలను రెచ్చగొడుతున్నటువంటి టిడిపి నేతలు ఎవరు అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే జడ్జ్ హిమబిందు పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జడ్జి హిమబిందు పట్ల ఈ విధమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఆ వ్యక్తి పేరు ముల్లా కాజా హుస్సేన్ గా ధ్రువీకరించారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఒక ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా పని చేస్తున్నారు అదే విధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఈయన వ్యవహరిస్తున్నారు. ఇక ఏసీబీ కోర్టు జడ్జ్ హిమబిందుపట్ల తానే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు చేశానని ఈయన అంగీకరించడంతో నంద్యాల పోలీసులు ఈయనని అదుపులోకి తీసుకున్నారు.