Nani: నాని మూవీకి భారీ నష్టాలు.. రిలీజ్ కు ముందే షాకంటూ?

Nani: నాచురల్ స్టార్ నాని హీరోగా సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కుతున్నటువంటి చిత్రం దసరా. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ మార్చి 30వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది. ఇలా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇలా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి చిత్ర బృందానికి మీడియా ప్రతినిధులు ప్రశ్నలు వేశారు.

ఈ క్రమంలోనే ఒక మీడియా ప్రతినిధి నానిని ప్రశ్నిస్తూ ఈ సినిమాకు 70 కోట్ల ఖర్చు చేశారని తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజమని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు నాని సమాధానం అయితే అవును లేదంటే లేదని చెప్పాలి కానీ ప్రొడ్యూసర్ సుధాకర్ మీరు చెప్పారా ఇంత ఖర్చయిందని అంటూ అడిగారు.అయితే ప్రొడ్యూసర్ మాత్రం ఈ సినిమా చూస్తే ఈ సినిమాకు ఎంత బడ్జెట్ పెట్టారు అనే విషయం మీకే అర్థమవుతుందని సమాధానం చెప్పారు.

 

డి గ్లామర్ రోల్ లో కీర్తి సురేష్ నాని జంటగా నటిస్తున్న ఈ సినిమాకు కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పని చేస్తున్నారు. అయితే ఈయనని నమ్మి భారీ బడ్జెట్ సినిమా చేయడానికి అంటే ముందుగానే కొంతమేర టేస్ట్ షూట్ చేశారట. ఇలా ఈ షూటింగ్ కోసం కూడా కొంత ఖర్చు చేశారని అది కూడా ఈ సినిమా లెక్కల్లోకి వస్తుందని తెలుస్తోంది. ఇలా ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యేలోపు దాదాపు 65 కోట్లు బడ్జెట్ ఖర్చయిందని సమాచారం.

 

ఇకపోతే ప్రమోషన్ల కంటూ ఈ బడ్జెట్ లెక్కలు వేస్తే సుమారు 80 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ చేసుకోవడంతో నిర్మాతలు కూడా ఈ సినిమా పట్ల ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏమాత్రం తేడా వచ్చినా భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్న నేపథ్యంలో ఆశలన్నీ కూడా బాలీవుడ్ ఇండస్ట్రీ పైన పెట్టుకున్నారు తప్పకుండా అక్కడ ప్రేక్షకులకు నచ్చి మంచి వసూలు రాబడితేనే ఈ సినిమా సక్సెస్ అందుకుంటుంది. తెలుగు వెర్షన్ కు ఓవర్ ఫ్లోస్ అన్నవి నిర్మాతకు రావు. ఎందుకంటే ముందుగానే అవుట్ రేట్ గా అమ్మేసారు. హిందీ వెర్షన్ బాగా కలెక్షన్లను సాధిస్తేనే నిర్మాత సేఫ్ జోన్ లో ఉంటారని లేకపోతే ఈ సినిమాకి నష్టాలు తప్పవని నిపుణుల అభిప్రాయం.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

LIC policy: ఈ ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసా.. రూ.కోటి పొందే అవకాశం!

LIC policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్వేరు వర్గాల కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ...
- Advertisement -