Nara Lokesh: వైరల్ అవుతున్న నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు!

Nara Lokesh: నారా లోకేష్ యువగలం పాదయాత్రలో భాగంగా ఈరోజు శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో 52వ రోజు తన పాదయాత్రను ప్రారంభించారు. అయితే పాదయాత్రలో భాగంగా ఈయన ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగన్ వచ్చే ఎన్నికలలో 175 సీట్లు తమ పార్టీని గెలుస్తుందనీ చాలెంజ్ విసిరారు. అయితే ఈ విషయం గురించి లోకేష్ మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికలలో భాగంగా వైసిపి ప్రభుత్వానికి ఏకంగా 151 సీట్లు గెలిపిస్తే ఆయన ఏం పీకారని వచ్చే ఎన్నికలలో 175 సీట్లు గెలిపించడానికి అని ప్రశ్నించారు. 151 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగన్ అధికారంలోకి రాగానే ఏం చేయాలి.. జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించాలి. ఎన్నో కంపెనీలను ఇక్కడికి తీసుకువచ్చి నిరుద్యోగులకు ఆసరా కల్పించాలి. అలా కాకుండా ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఉండవల్లిలో నిర్మించిన ప్రజావేదికను కూల్చేశారు.

 

ఇక ఈయన కంపెనీలను తీసుకురాక పోగా మేము తెచ్చిన కంపెనీలను కూడా పక్క రాష్ట్రాలకు పంపించారు. ఇలా భారీ స్థాయిలో మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలి గాని అప్పులలో, అవినీతి చేయడంలోనూ, గంజాయి పెంపకం సరఫరాలో రాష్ట్రాన్ని నెంబర్ వన్ పొజిషన్లో నిలబెట్టారు. ఇక ప్రతిపక్ష నాయకులపై దాడి చేయించడంలో కూడా జగన్ రెడ్డి రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలబెట్టారని లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

ఇక 151 సీట్లు గెలిపించిన ఏం పీకలేని జగన్ రెడ్డికి వచ్చే ఎన్నికలలో 175 సీట్లను ఎందుకు గెలిపించాలి అంటూ ఈయన ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావాలన్న మన రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలన్నా,రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలన్న వచ్చే ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆయన ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషంగా ఉంటారంటూ లోకేష్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Girl Child: ఆడపిల్ల పుడితే 6000 రూపాయలు.. ప్రభుత్వం శుభవార్త ఇదే!

Girl Child: ప్రస్తుత రోజులో చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్ల పుట్టడం ఒక దరిద్రంగా శాపంగా భావిస్తున్నారు. దారుణం ఏంటంటే మగవారు మాత్రమే కాకుండా చాలా మంది స్త్రీలు కూడా ఇదే విధంగా ఆలోచిస్తున్నారు.....
- Advertisement -
- Advertisement -