Naresh: మూడు పెళ్లిళ్లపై నరేష్ కామెంట్స్ వింటే షాకవ్వాల్సిందే!

Naresh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది తమ కెరీర్ లో బెస్ట్ సినిమాలు ఇవ్వడం ద్వారా మంచి పాపులారిటీని సంపాదిస్తుంటారు. మరికొందరు మాత్రం ఆఫ్ ది స్క్రీన్ ఏదో ఒక వివాదంలో చిక్కుకోవడం ద్వారా పాపులారిటీని సంపాదిస్తుంటారు. ఇలా పాపులారిటీని సంపాదించిన తెలుగు నటుడు నరేష్. మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్.. మలయాళ ఇండస్ట్రీకి చెందిన పవిత్రా లోకేష్ తో క్లోజ్ గా ఉండటం, వీరిద్దరిని నరేష్ మూడో భార్య మైసూర్ లోని ఓ హోటల్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని, చెప్పుతో కొట్టడానికి ప్రయత్నించడం సెన్సేషన్ అయింది.

మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్.. ముచ్చటగా నాలుగో పెళ్లి చేసుకోబోతున్నట్లు కొత్త ఏడాదిన ఓ వీడియోతో వెల్లడించాడు. ఎంతోకాలంగా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకుంటూ వస్తున్న పవిత్రా లోకేష్ తో త్వరలోనే ఏడడుగులు వేయబోతున్నట్లు.. ఓ వీడియోలో ఇద్దరు లిప్ కిస్ పెట్టుకొని అనౌన్స్ చేయడం జరిగింది. దీంతో కొత్త ఏడాదిలో వీరిద్దరికి వివాహం జరగబోతోందనే విషయం స్పష్టమైంది.

మూడో భార్యతో విడాకుల కోసం చాలాకాలంగా ఎదురుచూసిన నరేష్.. తాజాగా ఆ విషయంలో క్లియరెన్స్ దొరకడంతో పవిత్రా లోకేష్ తో నాలుగో పెళ్లికి సిద్ధమైపోయాడు. అయితే నరేష్ గతంలో చేసుకున్న మూడు పెళ్లిళ్లు ఎందుకు సెట్ అవలేదనే విషయాన్ని అతడు ఓ టీవీ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. బేసిక్ గా పరిస్థితుల వల్ల కాపురాల్లో చాలా మార్పులు వచ్చినట్లు నరేష్ చెప్పుకొచ్చాడు.

సమాజంలో కట్టుబాట్లు చాలా మారిపోవడం, ఒకప్పుడు ఉన్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఇప్పుడు లేకపోవడం, ఆర్భాటాలకు పోయి ఎక్కువ షో చేయాల్సి రావడం, విపరీతంగా ఖర్చు పెరగడం, భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ సంపాదించడం లాంటి అనేక కారణాల వల్ల భార్యాభర్తల బంధంలో చీలికలు వస్తున్నాయని.. అందులో తన మూడు పెళ్లిళ్లు కూడా ఉన్నాయని నరేష్ వెల్లడించాడు. సమాజంలో ఏర్పడిన పరిస్థితులు వివాహ బంధంలో చీలికలు తెచ్చినందుకే తన మూడు వివాహాలు అలా అర్ధంతరంగా ముగిసినట్లు నరేష్ తెలిపాడు.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -