Naresh: కృష్ణ చనిపోతే అలా చేసిన నరేష్.. పరువు పోయేలా?

Naresh: టాలీవుడ్ ఇటీవల వరుసగా ప్రముఖ నటులను కోల్పోతోంది. కృష్ణంరాజు మరణించి మూడు నెలలు కూడా గడవక ముందే సూపర్‌స్టార్ కృష్ణ కూడా ప్రేక్షకులకు దూరమయ్యారు. అనారోగ్య సమస్యలతో ఆయన నవంబర్ 15వ తేదీ తెల్లవారుజామున మరణించారు. సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆయనకంటూ ప్రత్యేకంగా కొన్ని పేజీలు రాసుకున్నారు. తొలి తెలుగు కలర్ చిత్రం సాంఘికం, తొలి జేమ్స్‌బాండ్, కౌబాయ్, సినిమాస్కోప్, 70 ఎంఎం, డీటీఎస్ మూవీ సహా తెలుగు చిత్ర సీమకు ఎన్నో కొత్త టెక్నాలజీలను ఆయన పరిచయం చేశారు.

 

చిత్ర పరిశ్రమలో లెజెండ్ లాంటి నటుడు చనిపోవడంతో ఎంతో మంది ప్రముఖులు ఆయన భౌతికకాయానికి స్వయంగా నివాళులు అర్పించేందుకు నరేష్ ఇంటికి వెళ్లారు. ఎందుకంటే కృష్ణ చనిపోయిన వెంటనే ఆయన పార్ధివదేహాన్ని నరేష్ ఇంటికే తరలించారు. అయితే తన ఇంటికి వచ్చిన సెలబ్రిటీలతో నరేష్ ప్రవర్తించిన తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినీ ప్రముఖులంతా కృష్ణ చనిపోయిన బాధలో ఉంటే.. నరేష్ మాత్రం అదేదో ఫంక్షన్‌లాగా వచ్చిన ప్రతి ఒక్కరినీ ఎదురెళ్లి స్వాగతించడం నచ్చలేదని మండిపడుతున్నారు.

 

మరోవైపు నరేష్ సహజీవనం చేస్తున్న నటి పవిత్రని కూడా అక్కడే కుటుంబ సభ్యులతో కలిపి కూర్చోబెట్టడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అసలే విషాద ఘటనతో బాధపడుతున్న కొందరికి పవిత్రను పరిచయం చేయడం మరింత ఎబ్బెట్టుగా అనిపించిందని చెప్తున్నారు. నరేష్ చేసిన పని ముమ్మాటికీ పరువు పోయేలా ఉందని.. అతడికి సిగ్గుశరం లేవా అని ప్రశ్నిస్తున్నారు. తన ప్రతిష్ట కోసం అంతగా దిగజారాల్సిన అవసరం లేదని.. ప్రతి విషయంలో కొన్ని లిమిట్స్ ఉంటాయని హితవు పలుకుతున్నారు.

 

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..
నరేష్ తల్లి విజయనిర్మల చనిపోయిన సమయంలోనూ అతడు ఇలాగే చేశాడని పలువురు సినీ పెద్దలు గుర్తుచేస్తున్నారు. అప్పుడు నరేష్ చేసిన చేష్టలు, ఇప్పుడు నరేష్ ప్రవర్తించిన తీరు సినీ పెద్దలకు కోపం తెప్పించాయని మండిపడుతున్నారు.నరేష్ ఇప్పటికైనా హుందాగా ఉండాలని సూచిస్తున్నారు. అటు సీఎం కేసీఆర్‌తో ఇటీవల అమర్యాదగా ప్రవర్తించడం, ఆయన వైపు చేయి చూపించడంతో నరేష్‌కు బుద్ధి లేదా అని పలువురు సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -