Raghu Rama Krishnam Raju: రఘురామకృష్ణంరాజు సంచలన సర్వే.. ఏపీలో గెలుపు ఆ పార్టీదే..

Raghu Rama Krishnam Raju: నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన సర్వే బయటపెట్టారు. ఏపీలో తాను ఎన్నికల సర్వే చేయించానని, జున్ నుంచి జులై తొలివారం వరకు తమ సొంత డబ్బులతో సర్వే చేయించినట్లు తెలిపారు. 175 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో 10 వేల శాంపిల్స్ తో సర్వే చేయించినట్లు చెప్పారు. శాస్త్రీయంగా ప్రభుత్వ సర్వే సంస్ధలతో చేయించినట్లు చెప్పారు. ఈ సర్వే వివరాలను ఢిల్లీలో మీడియాకు ఆయన వెల్లడించారు.

నియోజకవర్గాల వారీగా సర్వే వివరాలను చదవి వినిపించారు. ప్రతి నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీకి వచ్చే ఓట్ల శాతాన్ని స్వయంగా చదివి వినిపించారు. ఈ సర్వేలో టీడీపీ ఖచ్చితంగా గెలిచే సీట్లు 54 ఉన్నాయని తేలిందని, అలాగే టీడీపీకి ఎడ్జ్ ఉన్న స్థానాలు 39 ఉన్నాయని తాను చేయించిన సర్వేలో తేలిందన్నారు. టీడీపీ ఖచ్చితంగా గెలిచే స్థానాలు, ఎడ్జ్ ఉండే స్థానాలు కలుపుతో టీడీపీకి 93 సీట్లు వస్తాయని సర్వే ద్వారా తెలిసిందన్నారు.

ఇక టఫ్ ఫైట్ ఉన్న స్థానాల్లో సగం టీడీపీకి గెలిచినా.. ఆ పార్టీకి 127 సీట్లు వచ్చే అవకాశం ఉంటున్నారు. ఇక వైసీపీ ఖచ్చితంగా గెలిచే స్థానాలు 10 నుంచి 12 మాత్రమే ఉన్నాయన్నారు. వైసీపీకి ఎడ్జ్ ఉన్న స్థానాలు 5 నుంచి 6 ఉన్నట్లు చెప్పారు. దాదాపు 68 నియోజకవర్గాల్లో టీడీపీ, వైసీపీ మధ్య టఫ్ ఫైట్ ఉందన్నారు. ఉభయగోదావరి జిల్లాలో జనసేన ప్రభావం ఈ సారి ఎక్కువగా ఉంటుందని సర్వేలో తేలిందన్నారు.

టీడీపీ,జనసేన కలిసి పోటీ చేస్తే వార్ వన్ సైడ్ అవుతుందని, జగన్ కు ఓటమి ఖాయమని సర్వేలో తేలిందన్నారు. టీడీపీ, జనసేన ఓట్లు కలిస్తే తిరుగులేదని చెప్పారు. ఇక రాయలసీమలో కూడా వైసీపీ క్లిష్ట పరిస్ధితుల్లో ఉందని, అక్కడ టీడీపీ బలం పెరుగుతుందని సర్వేలో తేలిందన్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -