Nani: న్యాచురల్ స్టార్ నాని మాస్ కోరిక నెరవేరిందా?

Nani: టాలీవుడ్ హీరో నాని నటించిన తాజా చిత్రం దసరా. ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇటీవల శ్రీరామ పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా సినిమాగా విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ ను అందుకుని కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం చిత్ర బృందం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

కాగా ఈ సినిమాలో నాని మొట్టమొదటిసారిగా మాస్ లుక్ లో కనిపించడంతో పాటు మాస్ లుక్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా నాని తనను తాను ఒక మాస్ హీరో లేదా కమర్షియల్ హీరో అవ్వాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కాగా తాజాగా విడుదల అయినా దసరా మూవీతో నాని కల నెరవేరిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో నానితోపాటు కీర్తి సురేష్ కూడా డి గ్లామర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇద్దరి నటనకు గాను మంచి మార్కులు పడ్డాయి. నాని మొత్తానికి ఒక మంచి మాస్ హీరో అయ్యాడు. ఇక దసరా సినిమా కు కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి.

 

సరిగ్గా మంచి టైం చూసి చిత్ర యూనిట్ విడుదల చేసింది. వేసవి సెలవులు, శ్రీరామ నవమి సెలవు కావడంతో మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపేసింది. కీర్తి సురేష్ కూడా చాలా రోజులుగా ఒక మంచి పాత్ర కోసం ఎదురు చూస్తోంది. మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ ఈ పాత్రతో మరోసారి ప్రేక్షకులను మెప్పించింది. మరి ఇప్పుడైనా కీర్తి సురేష్ కు వరుసగా అవకాశాలు వస్తాయో లేదో చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

TTD’s Pink Diamond: పింక్ డైమండ్ ఎక్కడ జగన్.. ఎన్నికల్లో గెలుపు కోసం ఎంత నీచానికైనా దిగజారుతారా?

TTD's Pink Diamond: జగన్మోహన్ రెడ్డి 2019 సంవత్సరంలో అధికారంలోకి రావడం కోసం ఎన్నో నాటకాలను కూడా వేశారు అందులో భాగంగా కోడి కత్తి కావడం వైయస్ వివేక హత్య కావడం వంటివి...
- Advertisement -
- Advertisement -