Nava Brahma: ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తొమ్మిది రూపాల్లో కొలువైన బ్రహ్మదేవుడు..ఎక్కడో తెలుసా!

Nava Brahma: దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ‍కెల్లా తెలంగాణలో చాలా దేవాలయాలు, ప్రాచీన ఆలయాలు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా బ్రహ్మదేవుడు తొమ్మిది రూపాలలో కొలువున్న పుణ్యక్షేత్రం మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అలంపూర్‌లోఉంది. అంతేకాక అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన జోగులాంబ పూజలందుకునే దేవాలయం కొలువైన పుణ్యక్షేత్రం అలంపూర్. ఈ సృష్టికి మూలం బ్రహ్మ. సమస్త జీవరాశి పుట్టుకకు కారణమైన బ్రహ్మదేవుడి ఆలయాలు మన దేశంలో చాలా అరుదుగా ఉన్నాయి. అలాంటి పుణ్యక్షేత్రాలలో జోగులాంబ ఒకటి..ఇక్కడ కొలువైన నవబ్రహ్మ ఆలయ సముదాయంలోనే అష్టాదశ శక్తి పీఠాలలో ఒకరైన జోగులాంబను పూజిస్తుంటారు.

బాదామి చాళుక్యుల చేతిలో రూపుదిద్దుకున్న ఈ అలంపూర్‌ నవబ్రహ్మ ఆలయాలకు ప్రసిద్ధి. బ్రహ్మ తొమ్మిది వేర్వేరు రూపాలలో ఉండటం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. ఆలయాలపై పంచత్రంత కావ్య కథాశిల్పాలు, ఆదిత్య హృదయం, రామాయణ మహాభారత గాథల శిల్పాలు దర్శన మిస్తాయి. బాలబ్రహ్మశ్వర దేవాలయం ఆలయాలన్నింటిలో పెద్దది. పదిహేను వందల సంవత్సరాల క్రితం కట్టిన ఈ దేవాలయాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా కనిపిస్తాయి.

సాధారణంగా శైవ క్షేత్రాల్లో శివ లింగాలు స్థూపాకారంగా ఉంటాయి. అలంపూర్‌లో మాత్రం గోస్పాద ముద్రిక, రసాత్మ లింగంగా వెలిసింది. ఇక్కడి శివ లింగం జ్యోతిర్‌జ్వాలమయం. మూలవిరాట్‌ అయిన స్వామివారి లింగము రుద్రాక్షలతో రూపొందించిన అద్భుత లింగం. భక్తులు ఎంత నీటితో అభిషేకం చేసినా ఒక్క నీటి బిందువు కూడా బయటికి రాదని చెబుతుంటారు. ఈ లింగాన్ని పూజిస్తే అంతు లేని పుణ్యం లభిస్తుందని నమ్ముతారు.

క్రీస్తు శకం 9వ శతాబ్దానికి చెందిన సూర్య దేవాలయం జోగులాంబ ఆలయ ప్రాంగణంలో ఉంది.. ఇక్కడ విష్ణు మూర్తి కి చెందిన సుందరమైన విగ్రహాలు కూడా చెక్కి ఉన్నాయి. శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన నరసింహ దేవాలయం కూడా ఇక్కడే ఉంది. తుంగభద్ర నదులు కలిసిన ఈ క్షేత్రాన్ని సంగమేశ్వర క్షేత్రం అని కూడా అంటారు.ఆలయ సముదాయం చుట్టూ పటిష్టమైన గోడ… దాని రెండోవైపు చుట్టూ అలుముకున్న ట్లుగా ఉన్న నీటి ప్రవాహం అద్భుతంగా కనిపిస్తుంది. ఈ నదిలో కోరిన కోరికలు తీర్చమని దీపాలు వదులుతారు. కృష్ణా, తుంగభద్ర పుష్కరాల సమయంలో అలంపూర్‌ భక్తులతో కిటకిటలాడుతుంది. శక్తి రూపమైన అమ్మవారు కొలువైన ఈ క్షేత్రంలో పూజలు, అభిషేకాలతో నిత్యం ఆధ్యాత్మిక శోభ కనిపిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -