Nayan-Vignesh: నయన్ పుట్టినరోజుకు విఘ్నేష్ లవ్లీ విషెస్.. ఎలా చెప్పారంటే?

Nayan-Vignesh: సినిమాల్లో తనదైన ముద్రను వేసిన తమిళ సూపర్ స్టార్ నయన తార.. నవంబర్ 18న తన 38వ పుట్టిన రోజును జరుపుకుంటోంది. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న నయనతార.. ఈ సంవత్సరం తన పూర్తి కుటుంబంతో పుట్టినరోజును జరుపుకుంటోంది. భర్త, పిల్లలతో కలిసి ఎంతో స్పెషల్ గా ఈ బర్త్ డేని జరుపుకుంటుండగా.. భర్త విఘ్నేష్ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అయింది.

 

ఈ ఏడాది నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ లు మూడు ముళ్ల బంధంతో ఒక్కటవడం తెలిసిందే. ఇక కొన్ని నెలల క్రితమే వీరు కవల పిల్లలకు తల్లిదండ్రులుగా మారడం అందరికీ షాకిచ్చింది. అయితే ఈ ఏడాది చేసుకునే నయనతార బర్త్ డే తనకు ఎంతో ప్రత్యేకం కాగా.. దానిని మరింత స్పెషల్ గా మారుస్తూ విఘ్నేష్ తన ప్రేమను వ్యక్తపరిచాడు.

నయనతారకు సంబంధించిన కొన్ని అందమైన ఫోటోలను షేర్ చేసిన విఘ్నేష్.. నయన్ గురించి ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘‘నయన్, ఇది నువ్వు నాతో జరుపుకుంటున్న తొమ్మిదో పుట్టినరోజు. నీతో ప్రతి బర్త్ డే ఎంతో స్పెషల్, మెమరెబల్. కానీ ఇది మాత్రం ఇంకా స్పెషల్. మనం భార్యాభర్తలుగా లైఫ్ స్టార్ట్ చేశాము. ఇద్దరు అందమైన పిల్లలకు తల్లిదండ్రులుగా అయ్యాము. నువ్వు చాలా పవర్ ఫుల్ పర్సన్ గా నాకు ఎప్పుడూ తెలుసు. చేసే ఏ పనిలో అయినా కాన్ఫిడెంట్ గా, డెడికేటెడ్ గా ఉండటం అనేది నీ బలం’’ అని పేర్కొన్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Vignesh Shivan (@wikkiofficial)

‘‘ఇన్ని సంవత్సరాలు నిన్నొక డిఫరెంట్ పర్సన్ గా చూశాను. జీవితంలో నువ్వు చూపించే నిజాయితీ, సిన్సియారిటీ నన్ను ఎప్పుడూ ఇన్ స్పైర్ చేస్తాయి. నిన్ను అమ్మగా, హ్యాపీయెస్ట్ కంప్లీట్ ఫార్మేషన్ లో చూస్తున్నాను. నువ్వు ఇప్పుడు కంప్లీట్ అయ్యావు. చాలా సంతోషంగా ఉన్నావు. ఇంకా ఎక్కువ అందంగా కనిపిస్తున్నావు. ఈమధ్యన నువ్వు మేకప్ వేసుకోవడం లేదు. ఎందుకంటే పిల్లలు నీ ఫేస్ ని ముద్దాడతారు. ఇప్పటి కన్నా అందంగా ఇన్ని సంవత్సరాల్లో నేను ఎప్పుడూ చూడలేదు. లైఫ్ బ్యూటిఫుల్ గా ఉంది. శాటిస్‎ఫైగా, థ్యాంక్‎ఫుల్ గా అనిపిస్తోంది. నీ బర్త్ డేలు అన్నీ ఈ బర్త్ డే లాగానే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. లవ్ యు పొండాటి, మై లేడీ సూపర్ స్టార్’’ అంటూ విఘ్నేష్ తన ప్రేమను మాటల రూపంలో వ్యక్తపరిచాడు.

 

Related Articles

ట్రేండింగ్

Vizag Steel Plant: మూసివేత దిశగా విశాఖ ఉక్కు.. జగన్ సర్కార్ చేతకాని పాలనకు నిదర్శనం ఇదే!

Vizag Steel Plant:  విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఆనుకొని ప్రభుత్వం నిర్మించిన గంగవరం పోర్టుని ఆదాని గ్రూప్ పూర్తిగా హస్తగతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వారం రోజులుగా ఈ పోర్టులో...
- Advertisement -
- Advertisement -