Nayantara: నయనతారపై షాకింగ్ కామెంట్స్ చేసిన విఘ్నేష్ శివన్ తల్లి!

Nayantara: స్టార్ హీరోయిన్ నయనతారపై ఆమె అత్తయ్య ప్రశంసల వర్షం కురిపించింది. నయనతార చేసిన పనికి విఘ్నేష్ తల్లి మురిసిపోతుంది. నయన్‌ను పొగడ్తలతో ముంచెత్తుతోంది. తాజాగా నయనతార అత్తయ్య చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. నిజానికి మంచి కోడలు దొరకడం అత్తకు ఎంతో అదృష్టం. కొడుకును బాగా చూసుకునే కోడలు దొరికిందని నయనతార అత్త మీనా కుమారి మురిసిపోతున్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

 

ఈ సందర్భంగా మీనా కుమారి మాట్లాడుతూ.. ‘నా అబ్బాయి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్. కోడలు సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్. ఇద్దరిదీ కష్టపడే మనస్తత్వం. నయనతార హీరోయిన్‌గానే కాదు.. ఓ దయా హృదయం కలిగిన అమ్మాయి. మా ఇంట్లో ఎనిమిది మంది పనివాళ్లు ఉంటారు. వారిలో ఒకరికి రూ.4 లక్షల అప్పు ఉంది. ఆ అప్పులు తీర్చుకోకలేక ఇబ్బంది పడుతున్నాడనే విషయం తెలిసింది. దాంతో నయనతార అతడి అప్పులు మొత్తం తీర్చింది. నయనతారకు ప్రతి విషయం తెలుసు. ఇల్లును చక్కబెట్టుకోవడం, ఇంట్లో పెద్దవాళ్ల ఆలనా పాలన బాగా తెలుసు. పది మంది చేసే పనిని నయనతార ఒక్కతే చేయగలదు.’ అని చెప్పుకొచ్చింది.

 

విఘ్నేష్‌తోపాటు మిగిలిన పిల్లల్నీ కష్టపడటం నేర్పించామని తల్లి మీనా కుమారి తెలిపారు. కానీ అమ్మాయిలో కష్టపడే గుణం ఉండటం చాలా రేర్. నయనతార కూడా కష్టపడే గుణం కలది. వీరిద్దరి వృత్తి గౌరవప్రదమైనది. ఇద్దరూ ఉన్నతస్థాయికి ఎదుగుతారని చెప్పగలనని విఘ్నేష్ తల్లి మీనా కుమారి చెప్పారు. కాగా, ఏడేళ్లుగా ప్రేమించుకున్న నయన్-విఘ్నేష్.. ఈ ఏడాది జూన్‌లో వివాహం చేసుకున్నారు. మహా బలేశ్వరంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇటీవల తల్లిదండ్రులు కూడా అయినట్లు ప్రకటించారు. సరోగసి ద్వారా తల్లిదండ్రులు అయినట్లు తెలిపారు. దాంతో ఈ ప్రకటన వివాదానికి దారి తీసింది. నయన్ దంపతులు సరోగసి నిబంధనలు పాటించారా? లేదా? అనే విషయంపై తమిళనాడు ప్రభుత్వం విచారణ కూడా చేపట్టింది. దానిపై నయన్ దంపతులు తమకు ఐదేళ్ల క్రితమే వివాహం జరిగిందని, సరోగసి నిబంధనలు ఉల్లంఘించలేదని డాక్యుమెంట్లు సమర్పించింది. దాంతో ప్రస్తుతం ఈ వివాదం నుంచి నయన్ దంపతులు బయట పడినట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం నయన్.. బాలీవుడ్ సినిమా ‘జవాన్’లో నటిస్తోంది. అలాగే నాలుగు తమిళ సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి.

 

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -