Nayanthara-Vignesh: నయనతార విగ్నేష్ కవలల విషయంపై ఎంక్వైరీకి ఆదేశాలు.. శిక్ష తప్పదా?

Nayanthara-Vignesh: గత మూడు రోజులుగా పెద్ద ఎత్తున మీడియా వార్తల్లో నిలుస్తున్నారు నటి నయనతార దంపతులు. నయనతార గత ఏడు సంవత్సరాల నుంచి దర్శకుడు విగ్నేష్ శివన్ ప్రేమలో ఉండడమే కాకుండా ఈ ఏడాది జూన్ 9వ తేదీ వీరిద్దరూ వివాహం చేసుకున్నారు అయితే వీరి వివాహం జరిగిన నాలుగు నెలలకే వీరిద్దరూ తల్లిదండ్రులు అయ్యామంటూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ తీవ్రదుమానం రేపుతోంది.

పెళ్లయిన నాలుగు నెలలకే పిల్లలకు జన్మనివ్వడం ఏంటి అసలు నయనతార ప్రెగ్నెంట్ ఎప్పుడు అయ్యారు అంటూ పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే కొందరు సరోగసి ద్వారా పిల్లలను ప్లాన్ చేశారని అది కూడా పెళ్లికి ముందే పిల్లలను ప్లాన్ చేశారని భావిస్తున్నారు.అయితే ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెట్టడంతో ఏకంగా తమిళనాడు ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకునే పరిస్థితి తెలుస్తుంది.

సరోగసి ద్వారా నయనతార పిల్లలను కన్నారని వార్తలు రావడంతో తెలంగాణ వైద్యశాఖ మంత్రి ఎం సుబ్రహ్మణ్యం స్పందిస్తూ నయనతార కవలల విషయంపై ఎంక్వయిరీ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. కవలల విషయంలో సరోగసి విధానాన్ని పాటిస్తున్నట్లు ఎక్కడ వీరు ప్రస్తావించకపోవడంతో అసలు వీరికి పిల్లలు ఎలా జన్మించారు?సరోగసి విధానం ద్వారానే పిల్లలు జన్మించారా లేకపోతే దత్తత తీసుకున్నారా అనే విషయం గురించి ఎంక్వయిరీకి ఆదేశించారు.

సాధారణంగా పెళ్లయిన తర్వాత ఐదు సంవత్సరాల వరకు పిల్లలు కాకపోతే సరోగసి ద్వారా పిల్లలను కనే అవకాశం ఉంది. అయితే వీరికి పెళ్లయిన నాలుగు నెలలకే ఇలా సరోగసి ద్వారా జన్మనివ్వడం చట్టపరంగా నేరం అయితే ఈ విషయంలో మీరు నిబంధనలను పాటించారా లేదా ఉల్లంఘించారా అనే విషయంపై మెడికల్‌ డైరెక్టరేట్‌ ద్వారా వివరణ తీసుకుంటామని పేర్కొన్నారు. వీరి సరోగసి విధానంలో నిబంధనలను కనుక ఉల్లంఘించి ఉంటే వీరికి పెద్ద ఎత్తున శిక్షపడే అవకాశాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -