Nayanthara: తాళి అంటే నయనతారకు ఎంత గౌరవం.. మత్తెక్కించే ఫోటోలు!

Nayanthara: టాలీవుడ్ మోస్ట్ గ్లామరస్ బ్యూటి నటి నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తను నటించే సినిమాల్లో పాత్రలకు ప్రాణం పోసినట్లుగా నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. తన అందంతో ఎంతో మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా నిలిచింది.

ఎన్నో సినిమాలలో లేడి ఓరియెంటెడ్ పాత్రలలో బాగా ఆకట్టుకుంది. 2003 లో సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టగా.. 2006లో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ వంటి భాషల్లో కలిపి దాదాపు 30కి పైగా సినిమాల్లో నటించింది. ఇక ఈమె హీరోయిన్ గా కంటే వ్యక్తిగత విషయంలో కూడా బాగా హాట్ టాపిక్ గా నిలిచింది. గత కొంత కాలం నుంచి తను తమిళ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో ప్రేమలో ఉండగా ఈ జంట ఇటీవలే మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. ఆయనతో ప్రేమలో మునుగుతున్న నయన సోషల్ మీడియాలో తమకు సంబంధించిన ఫోటోలను తెగ పంచుకుంది. అంతేకాకుండా సినిమా షూటింగ్ లో వారిద్దరు కలిసి దిగిన రొమాంటిక్ ఫోటోలను అభిమానులతో బాగా పంచుకొని బాగా హడావుడి చేసింది.

ఇక తమ పెళ్లి సమయంలో పెళ్లి ఫోటోలను తన భర్త విఘ్నేష్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఇక తాము బాగా ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ వాటికీ సంబంధించిన ఫోటోలు పంచుకుంటాడు. ఇక తాజాగా నయన భర్త కొన్ని ఫోటోలను పంచుకోగా అందులో నయనతార తన అందాలతో మత్తెక్కించింది. ఇక ఆ ఫోటోలను బాగా గమనిస్తే అందులో తన మెడలో పసుపు తాడు ఇంకా వేసుకునే ఉంది. మాములుగా హీరోయిన్స్ తాళి బొట్టు తీసి పక్కన పెట్టేస్తారు. కానీ నయన మాత్రం ఇప్పటికీ అలాగే ఉంచుకోవడంతో.. నయనతార కు తాళి అంటే ఎంత గౌరవం అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.

 

View this post on Instagram

 

A post shared by Vignesh Shivan (@wikkiofficial)

 

View this post on Instagram

 

A post shared by Vignesh Shivan (@wikkiofficial)

Related Articles

ట్రేండింగ్

Note for Vote Case: ఓటుకు నోటు కేసును కావాలనే తెరపైకి తెస్తున్నారా.. చంద్రబాబును కావాలనే టార్గెట్ చేస్తున్నారా?

Note for Vote Case:  ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించినదో మనకు తెలిసిందే. ఇలా ఓటుకు నోటు కేసులో భాగంగా చంద్రబాబు నాయుడు రేవంత్...
- Advertisement -
- Advertisement -