Nayanthara: భర్త విఘ్నేష్ పై ఫైర్ అయిన నయన్.. అలా చెప్పడంతో?

Nayanthara: లేడీ సూపర్ స్టార్ అని పిలిపించుకునే కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార భలే మొండిదనే హాట్ టాపిక్ ఇప్పుడు వైరవ్ అవుతోంది. మనకు ఆమె కోలీవుడ్ స్టార్ హీరోయిన్ గానే తెలుసు. కానీ సౌత్ లోనే క్రేజీ హారోయిన్ గా ఆమె ట్యాగ్ ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఇప్పటి వరకూ ఏ సౌత్ హీరోయిన్ అందుకోలేనటువంటి రెమ్యూనరేషన్ ను ఆమె అందుకుందని చెప్పాలి. ఈమె ఒక్కో సినిమాకు ఏకంగా పది కోట్లకు పైన్ వసూలు చేస్తోంది.

 

నయనతార ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలపై ఆసక్తి చూపిస్తోంది. తాజాగా ఆమె కనెక్ట్ అనే సినిమా ద్వారా వస్తోంది. కనెక్ట్ సినిమా పై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే పాపులారిటీని సంపాదించుకుంది. ప్రతి సెంకడ్ కూడా ఈ సినిమా సస్పెన్స్ తో సాగుతుందని ట్రైలర్ ను చూస్తేనే తెలుస్తుంది. ఈ సినిమా నయనతార భర్త విఘ్నేష్ సొంత బ్యానర్ పైనే తెరకెక్కింది.

 

కోలీవుడ్ డైరెక్టర్ అయిన విగ్నేశ్ శివన్ ని నయనతార వివాహమాడింది. అయినప్పటికీ ఈ సినిమా ప్రమోషన్స్ కి నయనతార రాలేదు. నయనతార ఈ సినిమాకు మాత్రమే కాదు తాను చేసిన చాలా సినిమాలకు కూడా ప్రమోషన్స్ వర్క్ కు ఆమె రాదు. ఈ విషయాన్ని ఆమె ముందే చిత్ర యూనిట్ కు తెలుపుతుంది. ఈ క్రమంలోనే సొంత భర్త బ్యానర్ లో తెరకెక్కిన సినిమాకి సైతం ప్రమోషన్స్ చేయలేదని వార్తలు వినిపిస్తున్నాయి.

 

నయనతార తన భర్తకే మార్క్ షాక్ ఇచ్చిందన్న వార్తలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. అంతేకాకుండా విగ్నేష్ శివన్ నయనతారను ప్రమోట్ చేయమని కోరినా ఆమె అందుకు ఒప్పుకోలేదట. ఈ తరుణంలో కోలీవుడ్ లో వీరిద్దరి పేర్లు హాట్ టాపిక్ ట్రెండ్ అవ్వడం విశేషం. నయనతార తన పద్దతి మార్చుకోకపోతే సినిమా లైఫ్ లోనే కాకుండా నిజ జీవితంలో కూడా ఆమె కష్టాలు పడక తప్పదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Mahanadu: ఆ కీలక నేతలు మహానాడుకు ఆ రీజన్ వల్లే మిస్ అయ్యారా?

Mahanadu: మహానాడు కార్యక్రమం ముగిసింది. 2024 ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా బాబు ఈ మ‌హానాడును తీర్చిదిద్దారు. ఎన్టీఆర్ ఫ్రేమ్‌ త‌న ఇమేజ్‌ క‌ల‌గ‌లిపి వ‌చ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాల‌నేది చంద్ర‌బాబు వ్యూహం. అయితే...
- Advertisement -
- Advertisement -