ప్రేమించిన వాడు ఎక్కడ దూరమవుతాడోనని భయపడి చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న నటి!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకోవడం సర్వసాధారణం. అయితే కొందరు ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా ఉంటారు. మరికొంతమంది సహజీవనం చేసి చివరికి బ్రేకప్ అయిన వాళ్ళు ఉంటారు. ఇకపోతే పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టిన తర్వాత కూడా విడాకులు తీసుకొని విడిపోతున్న వారిని కూడా మనం చూస్తున్నాము. ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకుని ఎంతో అన్యోన్యంగా గడుపుతున్న వారిలో నటి నజ్రియా నజీమ్ ఒకరు.

ఈమె మలయాళ నటుడు ఫహద్ ఫజిల్ తో కలిసి మొట్టమొదటిసారి నటించిన బెంగుళూరు డేస్ చిత్రం ద్వారా వెండితెరపై సందడి చేశారు. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి విజయాన్ని అందుకున్న ఈమె ఈ సినిమాలో తనకు భర్తగా నటించిన నటుడు ఫహద్ ఫాజిల్ ప్రేమలో పడిపోయారు. ఇలా ఈమె 18 సంవత్సరాల వయసులోనే నటుడు ఫహద్ ప్రేమలో పడింది. తన కుటుంబ సభ్యులు తన పెళ్లికి ఎక్కడ నిరాకరిస్తారోనని అలాగే తాను ప్రేమించిన వ్యక్తి తనకు దూరమవుతారన్న ఉద్దేశంతో అతి చిన్న వయసులోనే వివాహం చేసుకున్నారు.

18 సంవత్సరాలకు హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈమె 19 సంవత్సరాల వయసులోనే పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు. ఇలా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇప్పటికి ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా ఉన్నారు. ఇకపోతే ఈమె తనకన్నా 12 సంవత్సరాల పెద్దవాడైన నటుడు ఫహద్ ను వివాహం చేసుకున్నారు. ఇలా వీరిద్దరూ వివాహమైనప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు.

ఇకపోతే ఈమె రాజా రాణి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై మొదటి సినిమాతోనే తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అందరినీ ఆకట్టుకున్నారు.ఇక తాజాగా నాని నటించిన అంటే సుందరానికి సినిమాతో ఈమె పూర్తిస్థాయి తెలుగు సినిమాలో నటించారు. ఇదిలా ఉండగా నటుడు ఫహద్ సైతం పుష్ప సినిమాలో విలన్ పాత్రలో నటించి సందడి చేశారు.ఈ విధంగా ఈమె అతి చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -