Mahesh Babu: మహేష్ బాబు కష్టపడతాడని ఇంతకు మించిన ప్రూఫ్ కావాలా?

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఈయన గత కొంతకాలంగా నటిస్తున్న సినిమాలన్నీ కూడా ఎంతో మంచి సక్సెస్ కావడంతో మహేష్ బాబు కూడా చాలా సుఖానికి అలవాటు పడ్డారని తెలుస్తుంది. సినిమాల పరంగా ఈయన ఏ విధమైనటువంటి కష్టమైన సన్నివేశాలు వచ్చిన వాటిలో నటించడానికి ఇష్టపడటం లేదని అలాగే ఆ సన్నివేశాలలో కష్టం లేకుండా నటించడం కోసం అన్ని ఏర్పాట్లు చేయించుకుంటున్నారని వార్తలు వచ్చాయి..

మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో ఒక సన్నివేశం చేయటం కోసం ఈయన ఏకంగా ఏసి ఉన్న సెట్ వేయించుకున్నారని అందులోకే పశువులను తీసుకెళ్లి ఒక సన్నివేశాన్ని చిత్రీకరించారు అంటూ గత కొద్దిరోజులుగా మహేష్ బాబు గురించి నెగిటివ్గా వార్తలు వస్తున్నాయి.మహేష్ బాబు సుఖపడటంతో కష్టపడి నటించడానికి కూడా ఏమాత్రం ఇష్టపడటం లేదంటూ మహేష్ యాంటీ ఫ్యాన్స్ కామెంట్లు చేశారు.

 

ఇలా మహేష్ బాబు గురించి నెగిటివ్ కామెంట్లు చేసిన వారికి ఈయన గుంటూరు కారం గ్లింప్ ద్వారా అందరి నోర్లు ముగించారని, అందరికీ తనదైన స్టైల్ లో ఘాటుగా సమాధానం చెప్పారనే తెలుస్తుంది. తాజాగా విడుదలైనటువంటి గ్లింప్ వీడియో చూస్తే కనుక ఇది మొత్తం అవుట్ డోర్ షూటింగ్లో చేశారని తెలుస్తుంది. మహేష్ బాబు కష్టపడరని కామెంట్లు చేసిన వారికి ఆయన ఎలా కష్టపడతారో ఇంతకన్నా ప్రూఫ్ అవసరం లేదని మహేష్ బాబు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

 

ఇక ఈ సినిమాకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో మహేష్ బాబు చాలా మాస్ లుక్ లోకనిపిస్తున్నారు. ఈ వీడియో కనుక చూస్తే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని అభిప్రాయం కూడా అందరిలోనూ ఏర్పడింది. మహేష్ బాబు సరసన పూజా హెగ్డే, శ్రీ లీల నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -