Bollywood: బాలీవుడ్ హీరోపై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటి!

Bollywood: బాలీవుడ్ లో తనకు ఇష్టమైన పాత్రలుచేస్తూ ట్యాలెంటెడ్ పర్సనాలిటీగా ఎదిగారు నటి నీనా గుప్తా. నటనలో క్యారెక్టర్ల ఎంపికతో పాటు నిజ జీవితంలో ఆమె వ్యవహార శైలి కూడా ముక్కు సూటిగా ఉంటాయనడంలో సందేహం లేదు. ట్రెండ్, ఇమేజ్ లకు తలొగ్గకుండా నచ్చిన పాత్రలనే చేస్తూ ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందారు నీనా గుప్తా. తన పర్సనల్ లైఫ్ కు, వృత్తి జీవితానికి పోలిక లేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.

 

నీనా గుప్తా సుమారు 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. కెరీర్ లో తనకు ఇప్పటి వరకు చేసిన రోల్స్ అన్నీ సంతృప్తినిచ్చాయని చెప్పారు. అయితే, ఓ విషయం మాత్రం తనకు నచ్చడం లేదని నీనా గుప్తా చెప్పింది. తాను వేసుకొనే బట్టలను బట్టి తన క్యారెక్టర్ ను డిసైడ్ చేయడం సరికాదని హితవు పలికింది. ఈ విషయంలో మీడియా, సినీ వర్గాలను ఆమె తీవ్రంగా తప్పు పట్టింది.

 

తాను వేసుకొనే డ్రెస్సులను బట్టే తనకు బోల్డ్ క్యారెక్టర్లు, వ్యాంప్ క్యారెక్టర్లు ఇచ్చే వారని నీనా గుప్తా చెప్పింది. ఈ నేపథ్యంలో పలువురు దర్శకులు నాకు ఎలాంటి పాత్రలివ్వాలనే సందేహంలో ఉండేవారని నీనా తెలిపారు. తాను మోడ్రన్ ఉమనా, లేక వెస్ట్రన్ కల్చర్ ఫాలో అవుతానా అనే ప్రశ్నలు వారిని తొలిచేవని తెలిపారు. టెలివిజన్ రంగంలో తాను పద్ధతిగా ఉండే తల్లి, సోదరి పాత్రలు చేశానని వెల్లడించింది.

 

ఆ ముద్ర వేసింది మీడియానే..
తనను మీడియానే బోల్డ్ ఉమెన్ గా ముద్ర వేసిందని నీనా ఆరోపించారు. ఈ నేపథ్యంలో దర్శకులంతా తనకు నెగిటివ్ రోల్స్ మాత్రమే ఇవ్వడానికి ప్రాముఖ్యం ఇచ్చే వారని నీనా వాపోయారు. యాక్టర్ అంటే ఎలాంటి పాత్రలైనా చేయగలగాలని చెప్పారు. ఓ సినిమాలో డాక్టర్ పాత్ర చేయాల్సి వస్తే అందులో నిజంగానే వైద్యులను తెచ్చి షూటింగ్ చేయరు కదా? అని ప్రశ్నించింది. బాదాయి హో సినిమా టైమ్ లో తనను తీసుకోవడానికి నటుడు ఆయుష్మాన్ ఖురానా నిరాకరించారంటూ ఆరోపణలు గుప్పించింది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -