Sith Ramam: సీతారామం మూవీలో ఏముంది అంటూ నెగిటివ్ ట్రోల్స్!

Sith Ramam: తెలుగు ప్రేక్షకులకు సీతారామం సినిమా గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, మృనాల్ ఠాకూర్, రష్మిక మందనలు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాలో సీనియర్ నటుడు సుమంత్ కూడా నటించాడు. కాగా ఈ సినిమా ఆగస్టు 5 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా గురించి తెలియంది ఏముంది.. ఊహించని స్థాయిలో సక్సెస్ అందుకుంది.

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా డైలాగ్ లు రీల్స్ రూపంలో తెగ హడావిడి చేస్తున్నాయి. ఇక ఈ సినిమాలోని పాటలు కూడా నెటిజన్ల నోట్లో తెగ నానుతున్నాయి. మొత్తానికి ఈ సినిమాకి ఊహించని స్థాయిలో ఆదరణ దక్కింది. ఈ విధంగా బ్లాక్ బస్టర్ హిట్ ను తన సొంతం చేసుకున్న సీతారామం సినిమా థియేటర్లలో 35 రోజులు ఆడింది. ఇక వెంటనే ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు.

దాంతో ఈ సినిమా ఓటీటీలో కూడా తెగ హడావిడి చేస్తుంది. ఇక ఒకసారి థియేటర్లో చూసినవారు మళ్లీ ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో కొన్ని ఇష్టమైన సన్నివేశాలు చూస్తున్నారు. కానీ థియేటర్ కు వెళ్లి చూడని వాళ్ళు అంతగా ఈ సినిమాలో ఏముందని అని తీసిపారేస్తున్నారు. ఇక విచిత్రంగా ఇప్పుడు ఈ సినిమా గురించి రెండు వర్గాల మధ్య వాదనలు జరుగుతున్నాయి. మరికొందరు మల్లీశ్వరి సినిమాలో వెంకటేష్, కత్రినా కైఫ్ ల ఎపిసోడ్ ని సీతారామం సినిమాగా మార్చినట్లు ఉందని బ్రేక్ ఇస్తున్నారు.

దీంతో కొందరు కొన్ని సినిమాలు థియేటర్లలో చూస్తేనే ఎక్స్పీరియన్స్ లో కిక్ ఉంటుంది. అంతేకానీ సోఫాలో బోర్లా పడుకుని స్కిప్ చేసుకుంటూ చూస్తే అందులో కొంచెం కూడా అర్థం కాదని ఈ సినిమా గురించి నెగిటివ్ గా మాట్లాడిన వారికి కొందరు బ్రేక్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా గురించి వాదనలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏదైనా ఈ సినిమా గురించి మంచి రెస్పాన్సే వచ్చింది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -