Nellore Kavitha: నిన్న వైజాగ్ ఝాన్సీ ఇవాళ నెల్లూరు కవిత రికార్డ్ డాన్సల తో దంచుడే దంచుడు!

Nellore Kavitha: బుల్లితెరపై ఈటీవీ అంటే మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజలలో ఒక మంచి గుర్తింపును తెచ్చుకుంది. కానీ ఈ మధ్యకాలంలో శ్రీదేవి డ్రామా కంపెనీ అని కామెడీ, డాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తూ బుల్లితెర అభిమానులను అలరిస్తూనే వస్తూ ఉంది. ఈ శ్రీదేవి డ్రామా కంపెనీని మల్లెమాల ప్రొడక్షన్స్ లో సక్సెస్ఫుల్ షో గా రన్ చేస్తూ వస్తోంది. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువ గా శ్రీదేవి డ్రామా కంపెనీలో రికార్డింగ్ డాన్స్ ల కార్యక్రమాలు చేస్తున్నారు. వైజాగ్ ఝాన్సీ చేసిన ‘పల్సర్ బైక్’ సాంగ్ పిచ్చ పాపులర్ అయినా క్రమంలో పలుమార్లు ఆమెను శ్రీదేవి డ్రామా కంపెనీకి పిలుస్తున్నారు.

గత పది సంవత్సరాలుగా బుల్లితెర కార్యక్రమాలలో విపరీతమైన మార్పులు వచ్చాయి. కుటుంబమంతా కలిసి చూసే బుల్లితెర కార్యక్రమాలు ఒకప్పుడు ప్రసారం చేసేలాగా ఇప్పుడు ప్రసారం చేయడం లేదు. ప్రస్తుత కాలంలో ఎన్నో టెలివిజన్ చానల్స్ వచ్చాయి. పోటీ పెరిగిపోవడం వల్ల ప్రతి ఛానల్ టిఆర్పి కోసం పనిచేస్తుంది.పది సంవత్సరాల క్రితం ఈటీవీ లో ప్రసారమయ్యే కార్యక్రమాలు కుటుంబ సభ్యులంతా కలిసి ఎంతో సంతోషంగా చూసేవారు.

పాడుతా తీయగా లాంటి క్లాసికల్ ఈవెంట్ ప్రసారమైన ఛానల్లో, బూతు జోకులు, ఎక్స్పోజింగ్ యాంకర్స్ తో కూడిన జబర్దస్త్ రావడంతో ఈటీవీ నీ అప్పుడే కొంతమంది అభిమానులు విమర్శించారు.జబర్దస్త్ షో ప్రారంభంలో కామెడీ పేరుతో డబుల్ మీనింగ్ డైలాగ్స్, బూతు జోకులతో కొంతమంది బుల్లితెర అభిమానులను చాలా ఇబ్బంది పెట్టారు.

జబర్దస్త్ లో రాను రాను డబల్ మీనింగ్ అంచులు ఎక్కువ అవ్వడంతో కొంతమంది ప్రేక్షకులు విమర్శించారు. దీంతో ఇప్పుడు కాస్త ఇలాంటి డైలాగులను తగ్గించారు. ఇలాంటి జబర్దస్త్ పద్ధతులు ఈటీవీ లోని ఇతర కార్యక్రమాలలో కూడా మొదలుపెట్టారు. డాన్స్ రియాల్టీ షో డి స్వరూపం కూడా మారిపోయింది. దీనికి కామెడీ రొమాన్స్ జోడించి సరికొత్తగా చూపిస్తున్నారు. సుధీర్ రష్మీ హైపర్ ఆది వీటన్నిటికీ ముఖ్య కారణం.

ప్రస్తుతం ఈటీవీ కొత్తగా శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి విజయవంతంగా ప్రసారం చేస్తూ ఉంది. శ్రీదేవి డ్రామా కంపెనీలో డాన్స్ కామెడీ రొమాన్స్ టాలెంట్ కార్యక్రమాలు ఇలా శ్రీదేవి డ్రామా కంపెనీని సృష్టించారు.శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చిన మొదట్లో చాలా బాగా కామెడీ స్క్రిప్ట్ లో చేస్తూ అభిమానులను అలరించింది.కానీ, రాను రాను ఈ షో రికార్డింగ్ డాన్సులకు అడ్డాగా మారుతుంది.

వైజాగ్ ఝాన్సీ చేసిన ‘పల్సర్ బైక్’ సాంగ్ బాగా విజయవంతం అవడంతో ఆమెను చాలా సార్లు ఈ ప్రోగ్రాం కి పిలుస్తూనే ఉన్నారు.ప్రస్తుతం వైజాగ్ ఝాన్సీ కి పోటీగా నెల్లూరు కవితను దించి వీరిద్దరి మధ్య పోటీ పెట్టేలాగా అభిమానులను తమ వైపుకు తిప్పుకుంటున్నారు. ఇలా శ్రీదేవి డ్రామా కంపెనీ పెట్టిన ఈ పోటీలో ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం బ్యాన్ చేసిన రికార్డింగ్ డాన్స్ లను ఈ ఇద్దరి ప్రదర్శన గుర్తుచేసింది. లోకల్ టాలెంట్ ని ముందుకు తీసుకు రావడం మంచి పనే, కానీ డాన్సుల పేరిట వల్ల స్టెప్స్ తో రచ్చ చేయడం మంచి పద్ధతి కాదు.

ఝాన్సీ కవిత వీరిద్దరి డాన్సులు హద్దులు దాటకుండా మల్లెమాల చూసుకుంటే మంచిది. ఇలానే సోషల్ మీడియాలో ఈ ప్రోగ్రాం పై విమర్శలు కూడా వస్తున్నాయి. దానివల్ల ఈటీవీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంది.సమాజంలో పద్ధతిగా జీవిస్తున్న వారికి ఇలాంటి కార్యక్రమాలు నచ్చడం లేదు. ఫ్యామిలీ ఆడియోస్ ఇలాంటి ఈవెంట్స్ రావడం వల్ల బుల్లితెరకు దూరం అవుతున్నారు.సుడిగాలి సుదీర్ శ్రీదేవి డ్రామా కంపెనీ యాంకర్ గా మొదట ఉండేవాడు. కానీ ఇప్పుడు సుధీర్ వెళ్లాక రష్మీ యాంకరింగ్ చేస్తూ వస్తుంది. ఈ కార్యక్రమానికి రష్మీ హైపర్ ఆది స్టార్స్ ప్రస్తుతం నడిపిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -