Nellore Kavitha: నెల్లూరు కవిత తీసుకునే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Nellore Kavitha: తెలుగు టీవీ షోలలో కొన్ని షోలకు విపరీతమైన ఫాలోయింగ్, పాపులారిటీ ఉంటాయి. అలాంటి పాపులారిటీని సంపాదించుకున్న టీవీ షోల జాబితాలో ఈటీవీలో వచ్చే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ కూడా ఒకటి. రకరకాల ట్యాలెంట్ ఉన్న వ్యక్తులను బుల్లితెరకు పరిచయం చేస్తూ.. కొత్త కొత్త కాన్సెప్టులను ఈ షోలో పరిచయం చేస్తూ ఉంటారు.

 

ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాన్ని ప్రతి ఒక్కరిని ఊపేసిన పర్ఫామెన్స్.. కండక్టర్ ఝాన్నీ చేసిన డ్యాన్స్ పర్ఫమెన్స్. ఈ పర్ఫామెన్స్ తో తెలుగు రాష్ట్రాలు ఊగిపోగా.. ఈమెకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది. ఇక కండక్టర్ ఝాన్నీకి పోటీగా శ్రీదేవి డ్రామా కంపెనీ.. నెల్లూరు కవిత అనే మరో లేడీ డ్యాన్సర్ ను తీసుకురావడం తెలిసిందే.

 

ఆమె కూడా స్టేజ్ షేక్ అయ్యేలా డ్యాన్స్ చేయడంతో.. ఇద్దరూ ఇద్దరే అని అందరూ అనుకునేలా చేశారు. అయితే తాజాగా నెల్లూరు కవిత తనకు ఇచ్చే రెమ్యునరేషన్ గురించి చెప్పింది. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన నెల్లూరు కవిత.. తన తండ్రి ఓ లారీ డ్రైవర్ అని, తల్లి ఆయాగా పని చేస్తోందని చెప్పుకొచ్చింది.

 

మధ్య తరగతి కుటుంబానికి చెందిన తనకు డ్యాన్స్ మీద ఉన్న మమకారంతో డ్యాన్స్ నేర్చుకున్నట్లు నెల్లూరు కవిత వివరించింది. ఇక తాను ఈవెంట్ కు అటెంట్ అయితే భారీ రెమ్యునరేషన్ ఏమీ ఇవ్వరని.. ఒక్క ఈవెంట్ కు తనకు రూ.5000 ఇస్తారని నెల్లూరు కవిత తెలిపింది. దీంతో ఆమె అదిరిపోయే పర్ఫామెన్స్ కు కేవలం రూ.5000ల రెమ్యునరేషన్ ఇవ్వడం ఏంటి అని అందరూ మాట్లాడుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -