Nene Vastunna Movie Review: నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్

నటీనటులు: ధనుష్, ఎలీ అవ్రామ్, ఇందుజా రవిచంద్రన్, ప్రభు, యోగిబాబు, సెల్వ రాఘవన్, షెల్లీ కిషోర్, శరవణ సుబ్బయ్య తదితరులు
నిర్మాణ సంస్థ: గీత ఆర్ట్స్
నిర్మాత: కలైపులి ఎస్ థాను
దర్శకత్వం: సెల్వ రాఘవన్
కథ: సెల్వ రాఘవన్, ధనుష్
సంగీతం: యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్
విడుదల తేదీ: సెప్టెంబర్ 29

Nene Vastunna Movie Review and Rating

తమిళ నటుడు ధనుష్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ హీరో అయినప్పటికీ కూడా ఇతని డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఇటీవల తిరు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ధనుష్ ఇక తాజాగా మరో సినిమా నేనే వస్తున్నా అనే మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమాను ధనుష్ అలాగే అతని సోదరుడు సెల్వరాఘవన్ కలిసి తెరకెక్కించారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో మూడు సినిమాలు వచ్చాయి. ఇక ఈ నాలుగో సినిమాతో ఇద్దరు అన్నదమ్ములు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారో లేదో మూవీ రివ్యూ లో చూద్దాం..

కథ: ఈ సినిమాలో ధనుష్ ద్విపాత్రాభినయం చేశాడు. మొదటిగా ప్రభు పాత్రలో కనిపించగా.. ఖదీర్ అనే రెండవ పాత్రలో కనిపించారు. ప్రభు ఓ ఉద్యోగం చేసుకుంటూ తన ఫ్యామిలీతో ఎంతో సంతోషంగా ఉంటారు. తనను బాగా అర్థం చేసుకునే భార్య అలాగే ఎంతో ముద్దుగా ఉండే కూతురు ఉంటుంది. అయితే ఈ నలుగురు ఎలాంటి కష్టం లేకుండా జీవితాన్ని సాఫీగా గడిపేస్తున్న సమయంలో సోను అనే దయ్యం ప్రభు కూతుర్ని ఆవహిస్తుంది. ఇక దెయ్యం ప్రభు కూతుర్ని వదిలి వెళ్లాలంటే ఖదీర్ ను చంపాలని కండిషన్ పెడుతుంది. ఖదీర్ అంటే ప్రభు కవల సోదరుడు. ఇతను ఒక సైకో. అందుకే చిన్నప్పుడే వీరిద్దరూ విడిపోయి ఉంటారు. ఇక సోను ఎవరు? ఖదీర్ ను ఎందుకు చంపాలనుకుంటుంది? అన్నదే మిగతా కథ.

నటీనటుల పనితీరు: ధనుష్ ద్విపాత్రాభినయంలో అద్భుతంగా నటించాడు. ప్రభు పాత్రలో చాలా డీసెంట్ గా నటించి ఖదీర్ పాత్రలో సైకోగా అద్భుతంగా నటించాడు. ఖదీర్ పాత్ర ధనుష్ అభిమానులకు చాలా సర్ప్రైసింగ్ గా అనిపిస్తుంది. ఇక హీరోయిన్లు ఇద్దరు కూడా పరవాలేదనిపించుకున్నారు. ధనుష్ కూతురు పాత్రలో చేసిన పాప చాలా అందంగా నటించింది. సస్పెన్స్ థ్రిల్లర్ తో సాగుతున్న ఈ సినిమాలో మధ్య మధ్యలో యోగి బాబు మంచి కామెడీ సన్నివేశాలని పండించారు. ఇక తదితరుల పాత్రలు కథ పరిధి మేరకే ఉంటాయి.

విశ్లేషణ: ఈ సినిమా కథకు నేనే వస్తున్నా అనే టైటిల్ కరెక్ట్ గా అనిపించింది. కానీ మేకర్స్ నుండి సినిమాకు కావాల్సినంత స్టఫ్ రాలేదనిపిస్తుంది. ఈ సినిమాను చాలా ఎంగేజింగ్ నెరేషన్, విజువల్స్ తో స్టార్ట్ చేశాడు దర్శకుడు.

ఎందుకంటే సైకో యాక్షన్ థ్రిల్లర్ తో స్టార్టింగ్ లో మెయిన్ క్యారెక్టర్స్ ని, కథను పరిచయం చేసిన విధానం చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ లో ప్రభు, ఖదీర్ ఫ్యామిలీ లైఫ్ ఖదీర్ సైకోలా మారడం వరకు చూపించాకా 20ఏళ్ల తర్వాత ప్రభుకి పెళ్లి, భార్య ఓ కూతురు ఉన్నారని చూపించి కథలోకి తీసుకెళ్తారు.

ఇంటర్వెల్ వరకు ప్రభు ఫ్యామిలీ, కూతురు సత్య, సైకియాట్రిస్ట్ క్యారెక్టర్స్ చుట్టూ కథను ఇంటరెస్టింగ్ గా నడిపించారు. ఇక ఇంటర్వెల్ లో రివీల్ చేసిన ట్విస్టుతో సెకండాఫ్ పై ప్రేక్షకులలో ఆసక్తి పెరుగుతుంది. చిన్నప్పుడు ఖదీర్ తన తండ్రిని దారుణంగా చంపడం తో తమ్ముడు అమ్మ అతనిని ఒంటరిగా వదిలి వెళ్ళిపోతారు.

ఇలా ఖదీర్ సైకో లా మారుతాడు. కూతురి కోసం ప్రభు పడే తపనతో ప్రేక్షకుల్ని ఎమోషనల్ చేశాడు దర్శకుడు. క్లైమాక్స్ కి వచ్చేసరికి ప్రభు, ఖదీర్ కలవడం, అక్కడ సీన్ మరింత ఇంటరెస్టింగ్ గా ఉండదు. కానీ చివరికి ప్రభు, ఖదీర్ లలో ఎవరు గెలిచారు అన్నది క్లారిటీ ఇవ్వకుండా అర్థాంతరంగా కథను ముగించారు.

ఈ సినిమాలో ఎన్నో లాజిక్స్ మిస్ అయిపోయాయి. డైరెక్టర్ ప్రభు పాత్రను సాఫ్ట్ గా చూపించి, ఖదీర్ పాత్రను రఫ్ గా చూపించాడు. ఇక ఖదీర్ సైకో లా ఎందుకు మారాడు అన్నది సరిగ్గా చూపించలేదు. అక్కడక్కడ కథ కాస్త నిదానంగా సాగినట్టు అనిపించింది.

ప్లస్ పాయింట్స్: ధనుష్ నటన, సంగీతం, హార్రర్ విజువల్స్, దర్శకత్వం.

మైనస్ పాయింట్స్: కథ, కథనం, లాజిక్ లేకపోవడం.

రేటింగ్: 2/5

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -