Nenu c/o Nuvvu Movie Review: నేను c/o నువ్వు సినిమా రివ్యూ & రేటింగ్

నటీ నటులు: రత్న కిషోర్, సన్య సిన్హా, సత్య,ధన, గౌతమ్ రాజ్ , సాగారెడ్డి, తదితరులు
నిర్మాణ సంస్థ: అగపే అకాడమీ
నిర్మాత: సాగా రెడ్డి తుమ్మ అత్తావలి, శేష్ రెడ్డి, పోలిష్ వెంకట్ రెడ్డి, కె. జోషఫ్.
దర్శకత్వం: సాగా రెడ్డి తుమ్మ
కథ- స్క్రీన్ ప్లే- డైలాగ్స్- : సాగా రెడ్డి తుమ్మ
సంగీతం: ఎన్.ఆర్.రఘునందన్
సినిమాటోగ్రఫీ : జి.కృష్ణ ప్రసాద్
ఎడిటర్ : ప్రవీణ్ పూడి

Nenu c/o Nuvvu Movie Review and Rating

సాగా రెడ్డి తుమ్మ దర్శకత్వం లో అగాపే అకాడమీ పతాకం పై రత్న కిషోర్, సన్య సిన్హా, సత్య, ధన, గౌతమ్ రాజ్ నటీ,నటులుగా తెరకెక్కిన చిత్రం నేను c/o నువ్వు. ఈ చిత్రానికి అత్తావలి , శేషిరెడ్డి, దుర్గేష్ రెడ్డి, కె.జోషఫ్ లు సహ నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదలైన మోషన్ పోస్టర్‌, టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 30 న గ్రాండ్ గా విడుదల అయ్యింది. అయితే “నేను c/o నువ్వు’’ సినిమా ఎలా ఉందో మూవీ రివ్యూ లో చూద్దాం..

కథ: ఈ సినిమా లో రత్న కిషోర్ మారుతి పాత్రలో నటించారు. ఇక సన్య సినా దీపిక పాత్రలో నటించింది. ఇక ఈ సినిమా 1980 లో జరిగిన కథ. పల్లెటూరులో నీ పేదింటి అబ్బాయి అలాగే ఉన్నత స్థితిలో ఉన్న అమ్మాయి మధ్య జరిగిన ఒక యదార్ధ సంఘటన ఆధారంగా తెరకెక్కిన కథ ఇది. గోపాలపురం అనే ఊరికి ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి ప్రెసిడెంట్ గా ఉంటాడు.

ఆ ఊరిలో కులాల మధ్య విపరీతమైన వర్గపోరు నడుస్తూ ఉంటుంది. అయితే ఆ ఊరిలో ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన మారుతి ప్రెసిడెంట్ ప్రతాప్ రెడ్డి చెల్లెలు దీపిక ను గుడిలో చూసి ఆమెను మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. అయితే ప్రెసిడెంట్ ప్రతాప్ రెడ్డి మాత్రం తన కులం అమ్మాయిలను ప్రేమిస్తే అలాగే రాజకీయంగా ఎదగాలని చూస్తే వారిని చంపేస్తుంటాడు.

అయితే ఇక రోజూ దీపిక వెంట మారుతి పడుతూ ఉంటారు. మారుతీని మొదట దీపిక పట్టించుకోక పోయినా ఎగ్జామ్స్ టైమ్ లో మారుతి చేసిన హెల్ప్ తో అతన్ని ఇష్టపడుతుంది. ఒకసారి దీపిక చేతిని మారుతి పట్టుకోవడం చూసిన ప్రతాప్ రెడ్డి తక్కువ కులపోడని మారుతిని దారుణంగా కొడతాడు. దీంతో దీపిక మారుతి పై మరింత ప్రేమను పెంచుకుంటుంది.

వీరిద్దరిని చూసిన తర్వాత ప్రతాప్ రెడ్డి తన కులం అబ్బాయి కార్తీక్ తో దీపిక కు పెళ్లి ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? దీపిక ను మారుతి పెళ్లి చేసుకున్నాడా? లేదా? కులానికి వ్యతిరేకంగా ఉన్న వెళ్ళ ప్రేమ గెలిచిందా? లేదా? అన్నదే మిగతా కథ

నటీనటుల పనితీరు: హీరో గా పరిచయం అయిన రత్న కిషోర్ కొత్తవాడైనా తన పరిధిలో చాలా చక్కగా నటించాడు . సన్య సిన్హా తన నటనతో బాగా ఆకట్టుకుంది. గౌతమ్ రాజ్, ధనరాజ్ లు కూడా బాగా నటించారు. సత్య, రాధాకృష్ణ , బాషా తదితరులు అందరూ చాలా చక్కగా నటించారు. దర్శకుడిగా, నటుడుగా సాగారెడ్డి తుమ్మ ప్రతాప్ రెడ్డి పాత్రలో చక్కటి విలనిజం బాగా చూపించాడు. తదితరులు తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

విశ్లేషణ: దర్శకుడు సాగా రెడ్డి తుమ్మ ఈ చిత్రాన్ని విభిన్న మైన కోణంలో, విభిన్న మైన స్క్రీన్ ప్లే తో, దర్శకత్వం అన్నీ తన బుజాలమీద వేసుకుని బాగా చేసాడు.

ఇక కులం పేరుతో పరువు హత్యలు జరుగుతున్న ఇటువంటి మంచి కథను సెలెక్ట్ చేసుకొని చాలా చక్కగా చిత్రీకరించాడు. ఎన్.ఆర్.రఘునందన్ గారు అందించిన సంగీతం సినిమాకు ప్లస్ అయింది.

ఆయన అందించిన నాలుగు పాటలు కూడా సందర్భాను సారం వస్తాయి. జి.కృష్ణ ప్రసాద్ తీసిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ పని తీరు బాగుంది.

అలాగే ఫైట్స్ బాగా ఉన్నాయి. ఈ చిత్రం చూస్తుంటే టెక్నిసియన్స్ హార్డ్ వర్క్ కనిపిస్తుంది. ఆగాపే అకాడమీ పతాకంపై సాగారెడ్డి తుమ్మ స్వీయ దర్శకత్వంలో వహించిన ఈ చిత్రానికి అత్తావలి, శేషిరెడ్డి, దుర్గేష్ రెడ్డి, కె .జోషఫ్ లు సహ నిర్మాతలు అందరూ కలసి ఖర్చుకు వెనుకాడకుండా చాలా చక్కగా నిర్మించారు.

ఈ మధ్య కాలం లో చాలా చోట్ల కులం పేరుతో పరువు హత్యలు చూస్తున్నాము. అలాంటి మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన “నేను c/o నువ్వు’’ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది.

ప్లస్ పాయింట్స్ : కథ, దర్శకుడు సాగా రెడ్డి తుమ్మ నటన, విజువల్స్, సంగీతం, హీరోయిన్ నటన

మైనస్ పాయింట్స్: హీరో నటన, సినిమాలో పెద్ద ఆర్టిస్ట్ లు లేకపోవడం.

రేటింగ్: 3/5

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -