Nenu Meeku Baaga Kavalsina Vaadini Review : నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమా రివ్యూ & రేటింగ్

విడుదల తేది : సెప్టెంబర్ 16
నటీనటులు: కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్, సోను ఠాకూర్, సిద్ధార్థ్ మీనన్, ఎస్వీ కృష్ణారెడ్డి, బాబా భాస్కర్, సమీర్ సంగీత, నిహారిక, ప్రమోదిని, భరత్ రంగోలి.
నిర్మాత : కోడి దివ్య దీప్తి.
దర్శకత్వం : శ్రీధర్ గాదె
స్క్రీన్ ప్లే, మాటలు : కిరణ్ అబ్బవరం
సంగీతం : మణిశర్మ
సినిమాటోగ్రఫీ : రాజ్ నల్లి
ఎడిటర్ : ప్రవీణ్ పూడి

Nenu Meeku Baaga Kavalsina Vaadini Movie Review and Rating

కథ: తేజు ( సంజన ఆనంద్) ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆమె ఓ అబ్బాయిని ప్రేమించి మోసపోయి ఉంటుంది. మోసపోయినందువల్ల ఎవరికీ ముఖం చూపించలేక ఒంటరిగా జీవితాన్ని గడిపేస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఆమె మద్యానికి అలవాటు పడుతుంది. అలా సాగుతున్న ఆమె జీవితంలో క్యాబ్ డ్రైవర్ వివేక్ (కిరణ్ అబ్బవరం) వస్తాడు. తేజు తాగి పడిపోయిన ప్రతిసారి ఆమెను ఇంటి వరకు డ్రాప్ చేసేవాడు. ఒకసారి తేజును ఓ గ్యాంగ్ కిడ్నాప్ చేయబోతే ఫైట్ చేసి కాపాడుతాడు.

దీంతో తేజుకు వివేక్ పై మంచి అభిప్రాయం ఏర్పడి తన విషాద గాధను వివేక్ తో పంచుకుంటుంది. అప్పుడు వివేక్ కూడా తన విఫల ప్రేమ కథను ఆమెతో పంచుకుంటాడు. మరి ఆ తర్వాత ఏమైంది? ఇద్దరి ప్రేమ కథలకు ఉన్న లింక్ ఏంటి? ఒకరి కథ మరొకరు తెలుసుకున్నాక ఇద్దరు కలిసి ఏం చేశారు? అన్నదే మిగతా కథ.

విశ్లేషణ : వచ్చి రాగానే రొటీన్ కమర్షియల్ ఫార్ములా ను ఉపయోగించారు. నాలుగు పాటలు, ఐదు ఫైట్లు, ఒక ఐటమ్ సాంగ్. ఇక కథలో కూడా కొత్తదనం కొంచెం కూడా లేదు. కిరణ్ ఇమేజ్ కు మించిన స్థాయిలో హీరోయిజం ప్రదర్శించారు. అలాగే హీరో హీరోయిన్లు చెప్పుకున్న తమ విఫల కథలలో కూడా ఏమాత్రం కొత్తదనం లేదు. అక్కడక్కడ ఆ కథలలో ట్విస్టులు ఉన్నాయి అంతే. బాబా భాస్కర్ తో కిరణ్ చేసిన హంగామా మరి అతిగా ఉన్నాయి.

నటీనటుల పనితీరు : వివేక్ పాత్రలో కిరణ్ అబ్బవరం నటన బాగుంది. కానీ నటనపై కంటే మాస్ ఎలివేషన్లపైనే ఎక్కువగా దృష్టి పెట్టాడు. కిరణ్ పాటలలో వేసే స్టెప్పులు ఆకట్టుకుంటాయి. అలాగే తేజు పాత్రలో సంజన ఆనంద్ పర్వాలేదు అన్నట్టుగా చేసింది. సోను ఠాకూర్, బాబా భాస్కర్, ఎస్.వి.కృష్ణారెడ్డి తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి.

ప్లస్ పాయింట్స్ : కిరణ్ నటన, మణిశర్మ సంగీతం

మైనస్ పాయింట్స్ : బలం లేని కథ కథనాలు, బలహీనమైన స్క్రీన్ ప్లే, ముగింపు

రివ్యూ రేటింగ్‌: 2.5/5

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -